తన సక్సెస్ కు ఆమే కారణం అంటున్న సత్యదేవ్..?

కెరీర్ మొదట్లో స్టార్ హీరోల సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించి జ్యోతిలక్ష్మి సినిమాలోని పాత్ర ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్.టాలెంట్ పుష్కలంగా ఉన్న సత్యదేవ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లు పెద్దగా లేకపోయినా బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారెవరురా, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 Hero Satyadev Shares The Person Behind His Success , Career Sucess, Gurtunda See-TeluguStop.com

ప్రస్తుతం సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నాతో కలిసి నటిస్తున్నారు.

వైజాగ్ కు చెందిన సత్యదేవ్ తను కెరీర్ లో సక్సెస్ కావడానికి భార్యే కారణమని ఆమె ఇచ్చిన సలహాలు, సూచనలే తాను కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణమయ్యాయని చెప్పారు.

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాలో మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన గువ్వ గోరింక, తిమ్మరుసు చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించిన సత్యదేవ్ సినిమాల్లోకి రావడానికి తన భార్యే కారణమని తెలిపారు.

Telugu Career Sucess, Satyadev, Deepika-Movie

తాను బాల్యం నుంచి ఏ పనిని మొదలుపెట్టినా ఆ పనికి నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని తన భార్యకు ఆ విషయం బాగా తెలుసని అన్నారు.చిన్నప్పటి నుంచి తనకు సినిమాలు అంటే ఎక్కువగా ఇష్టమని ఒకవైపు జాబ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవాడినని తన భార్య దీపిక జాబ్ వదిలేసి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించమని చెప్పిందని పేర్కొన్నారు.

తను సినిమాల్లో సక్సెస్ అయినా కాకపోయినా ఏదో ఒక విధంగా బ్రతికేస్తానని నమ్మకం తనకు ఉందని.ఆ నమ్మకంతో దీపిక సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించిందని అన్నారు.

అయితే తన తల్లిదండ్రులు మాత్రం జాబ్ వదిలేసి సినిమాల్లోకి వెళతానంటే అంగీకరించలేదని వాళ్లను కూడా దీపిక ఒప్పించిందని.అలాంటి భార్య దొరకడం ఎంతో లక్కీ అని సత్యదేవ్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube