అలాంటి పాత్రలు ఎన్నొచ్చిన వదులుకోను.. నా ఎదుగుదల వెనుక కష్టాలు!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా పండుగ రోజు అక్టోబర్ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే.

 Hero Sathya Dev Talking About Her Movies Roles, Sathya Dev, God Father Movie, Mo-TeluguStop.com

విడుదల తేదీకి మరి కొద్ది రోజుల సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.ఈ సినిమాలో నటుడు సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటించారు.

తాజాగా ఒక మీడియా ఛానల్ తో ముచ్చటించినా సత్యదేవ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ.

 Hero Sathya Dev Talking About Her Movies Roles, Sathya Dev, God Father Movie, Mo-TeluguStop.com

సోలో కథానాయకుడిగానే చేయాలన్న స్వార్థం నాకూ ఉంది.

కానీ అదే సమయంలో అద్భుతమైన పాత్రలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అనిపిస్తుంది.

అందుకే నాలోని నటుణ్ని ఉత్తేజితుణ్ని చేసే ఏ తరహా పాత్రనైనా తప్పకుండా చేస్తుంటా అని చెప్పుకొచ్చాడు సత్యదేవ్‌.అనంతరం చిరంజీవి గురించి మాట్లాడుతూ.ఒకరోజు చిరంజీవి అన్నయ్య సెట్లో లంచ్ కి రమ్మని పిలవగానే వెళ్లాను.అప్పుడు కూర్చోబెట్టి ఒక కథ ఉంది అనిచెప్పడం ప్రారంభించారు.

ఆ సమయంలో చిరంజీవి అన్నయ్య నాకు కథ చెప్పడం ఏంటి అనే నేను ఆశ్చర్యపోయాను.నిజంగా అలాంటి సంఘటన వస్తుంది అని నేను కలలో కూడా అనుకోలేదు.

నా గురువుగా భావించిన చిరంజీవి అన్నయ్య నన్ను కూర్చోబెట్టి కథ చెప్పడం నాకు షాకింగ్ గా అనిపించింది.అంతే కాకుండా మధ్యలో కథ ఆపి నా వంక చూసి నేను సరిగ్గా కథ చెప్పడం లేదా పోనీ దర్శకుడితో కథ చెప్పించనా అని అడిగారు.అప్పుడు వెంటనే నేను మీరు నాకు కథ చెప్పడమే ఒక కలలా ఉంది అన్నయ్య దీనికి మించి నాకు నాకేం అర్థం కావడం లేదు మీరు చేయమని చెప్తే నేను చేసేస్తాను అని చెప్పాను అని తెలిపాడు సత్యదేవ్.ఇకపోతే గాడ్ ఫాదర్ సినిమా విషయానికి వస్తే మెగా అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube