ఈ ఫోటోలో ఉన్న నటుడు ఎవరో కనుక్కోండి చూద్దాం!

మెగ‌స్టార్ చిరంజీవి.! ఆయ‌న వేసిన పునాది రాళ్ల మీద న‌డుచుకుంటూ వ‌చ్చి సినిమా అనే వెండితెర వెలుగుల ప్ర‌పంచంలో యాక్ట‌ర్ గా త‌మ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న‌వారు ఎంతోమంది ఉన్నారు.

 Hero Sathyadev Childhood Photo Viral, Sathyadev, Family Photo, Umaheshwara Ugrar-TeluguStop.com

వారిలో ఈ యాక్ట‌ర్ కూడా ఉన్నారు.సాఫ్ట్ వేర్ గా నెల‌కు ల‌క్ష‌న్న‌ర జీతం వ‌స్తున్నా యాక్టింగ్ పై ఉన్న ప్యాష‌న్ తో ఆ జాబ్ ను తృణ‌ప్రాయంగా వ‌దిలేశారు.

చిన్న‌త‌నం నుంచే మెగ‌స్టార్ ఇన్స్పిరేష‌న్ తో ఆయ‌న సినిమా చూస్తూ సినిమాల్లోకి వ‌చ్చారు.తొమ్మిదేళ్ల సినీ ప్ర‌స్థానంలో 25 సినిమాల్లో న‌టించి స్టార్ హీరో అయ్యారు.

ఆయ‌నే హీరో స‌త్య‌దేవ్.
చిన్న‌త‌నంలో చిరంజీవి న‌టించిన కొద‌మ సింహం సినిమాలో మెగ‌స్టార్ రెండు కొండ‌ల మ‌ధ్య జ‌రిగే ఫైట్ లో తాడు ప‌ట్టుకొని జంప్ చేసే సీన్ ఉంది.

ఆ సీన్ ను సత్య‌దేవ్ ఇంట్లో కేబుల్ వైర్ తో ట్రై చేస్తే.త‌ల‌ప‌గిలి స్టెచ్చ‌ర్ పై ప‌డుకోబెట్టేలా చేసింది.
సినిమా అంటే అంత పిచ్చున్న స‌త్య‌దేవ్ షార్ట్ ఫిల్మిం డైర‌క్ట‌ర్ గా త‌న కెరియ‌ర్ ను ప్రారంభించాడు.అలా 2011లో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కిన మిస్ట‌ర్ ఫ‌ర్ఫెక్ట్ సినిమాలో క్యారక్ట‌ర్ తో వెండితెర‌కు ప‌రిచ‌య‌మ్యారు.ఫ‌స్ట్ సినిమా మిస్ట‌ర్ ఫ‌ర్ఫెక్ట్ నుంచి తాజాగా విడుద‌లైన ఉమామేశ్వ‌ర ఉగ్ర‌రూపస్య సినిమా వ‌ర‌కు విల‌న్ గా, హీరోగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు.
2018లో క్రైమ్ థ్రిల్ల‌ర్ జోనర్ లో విడుద‌లైన బ్ల‌ఫ్ మాస్ట‌ర్ సినిమాలో హీరోగా స‌త్య‌దేవ్ ప‌లికిన డైలాగ్స్ ప్ర‌తీఒక్క‌రితో క్లాప్స్ కొట్టేలా చేశాయి.బుల్లెట్ల లాంటి డైలాగ్స్ మేన‌రిజంతో ఆక‌ట్టుకున్న స‌త్య‌దేవ్ న‌ట‌న‌కు మెగ‌స్టార్ చిరూ కూడా ఫిదా అయ్యారు.బ్ల‌ఫ్ మాస్ట‌ర్ సినిమా చూసి స‌త్య‌దేవ్ ను మెచ్చుకున్నారంటే ఫ‌ర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.
ఇక స‌త్య‌దేవ్ సినిమా విషయానికొస్తే.రీసెంట్ గా విడుద‌లైన ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య సినిమాతో మ‌రిన్ని ఆఫ‌ర్లు క్యూక‌ట్టాయి.

ప్ర‌ముఖ ఓటీటీల్లో యాక్ట్ చేస్తుండగా.ఆకాశ‌మే హ‌ద్దురా సినిమాలో త‌మిళ్ హీరో సూర్య వాయిస్ కు డ‌బ్బింగ్ చెబుతున్నారు.

దీంతో పాటు మ‌ళ‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన ల‌వ్ కాక్ టైల్ సినిమా తెలుగు రీమేక్ అవుతుంది.ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube