పేపర్ బాయ్ కి వరుస సినిమాల్లో అవకాశమిచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్…   

Santhosh Shobhan, Prabhas, Tollywood young hero, Rebal star, Tollywood, Uv Creations, - Telugu Prabhas, Rebal Star, Santhosh Shobhan, Tollywood, Tollywood Young Hero, Uv Creations

తెలుగులో ప్రముఖ దర్శకుడు జయశంకర్ దర్శకత్వం వహించిన  “పేపర్ బాయ్” అనే చిత్రంలో హీరోగా నటించి సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులు కొట్టేసిన యంగ్ హీరో సంతోష్ శోభన్ గురించి కొత్తగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సతీష్ శోభన్ అంతకు ముందు గోల్కొండ హైస్కూల్ అనే చిత్రంలో పదో తరగతి చదువుతున్న కుర్రాడి పాత్రలో నటించి తమ స్కూల్ క్రికెట్ గ్రౌండ్ కోసం క్రికెట్ ఆడి తెలుగు ప్రేక్షకులను బాగానే మెప్పించాడు.

 Hero Santosh Sobhan To Act In Uv Creations Movies

అయితే ఇంతకీ విషయం ఏంటంటే తాజాగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణం సంస్థ అయినటువంటి యు.వి.క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రెండు చిత్రాలలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే సంతోష్ శోభన్ కి ఈ అవకాశాలు దక్కడానికి పరోక్షంగా టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సహాయ పడినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.

సినీ పరిశ్రమలో నూతన నటీనటులను ప్రోత్సహించడంలో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటాడు.ఇందులో భాగంగానే ఎవరైనా సరే తమ చిత్ర ప్రమోషన్స్  కోసం సంప్రదిస్తే ఖచ్చితంగా ఆడియో ఫంక్షన్లకి మరియు ఇతర ఫంక్షన్లకు వెళుతుంటాడు.

పేపర్ బాయ్ కి వరుస సినిమాల్లో అవకాశమిచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్… -Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కేకే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “రాధే శ్యామ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదల కాగా మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

అలాగే ప్రభాస్ మహానటి చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ తరహాలో ఉండడమే కాకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

#Rebal Star #UV Creations #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Santosh Sobhan To Act In Uv Creations Movies Related Telugu News,Photos/Pics,Images..