సంపూ మళ్లీ రియల్‌ హీరో అయ్యాడు.. చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు

టాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ కమ్‌ నటుడు.ఇంటర్వ్యూవర్‌ తుమ్మల నరసింహారెడ్డి అలియాస్ టీఎన్నార్‌ మృతి పట్ల ఇండస్ట్రీ వర్గాల వారు పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.

 Hero Sampoornesh Babu Donate 50k To Tnr Family-TeluguStop.com

ఆయన సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఆయన కూడబెట్టింది పెద్దగా ఏమీ లేదు.ఇటీవల ఆయన సోదరి అనారోగ్యం కారణంగా తన వద్ద ఉన్న లక్షల డబ్బును ఆయన ఖర్చు చేశాడట.

దాంతో ఆయన కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.భార్య ఇద్దరు పిల్లలు ఉన్న టీఎన్నార్‌ ఫ్యామిలీ పడుతున్న ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న కొందరు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

 Hero Sampoornesh Babu Donate 50k To Tnr Family-సంపూ మళ్లీ రియల్‌ హీరో అయ్యాడు.. చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెగా స్టార్‌ చిరంజీవి ఇప్పటికే లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సాయంను పంపించాడు.చిరంజీవి తో పాటు సంపూర్నేష్‌ బాబు కూడా ఆర్ధికంగా సాయం చేశాడు.

సంపూర్నేష్‌ బాబు కు టీఎన్నార్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.సంపూ కుటుంబ సభ్యులను జనాలకు పరిచయం చేసింది టీఎన్నార్‌.ఆయన వల్లే సంపూర్నేష్‌ బాబు కు మరింత పాపులారిటీ దక్కింది.అందుకే టీఎన్నార్ ను సోదర సమానుడిగా సంపూ చూస్తూ ఉంటాడు.అందుకే టీఎన్నార్‌ చనిపోయిన సందర్బంలో సంపూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.అదే సమయంలో టీఎన్నార్‌ ఫ్యామిలీకి తన వంతు సాయం అందించాలనుకున్నాడు.

అందుకే ఏకంగా 50 వేల రూపాయలను తక్షణ సాయంగా అందించడంతో పాటు ఆయన సోషల్‌ మీడియాలో టీఎన్నార్‌ కుటుంబ సభ్యులకు సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశాడు.టీఎన్నార్‌ మృతి పట్ల ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేశారు.

అందులో కొందరు అయినా ఆయన ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సంపూర్నేష్‌ బాబు మంచి మనసుకు అంతా కూడా ఫిదా అవుతున్నారు.

 గతంలో కూడా సంపూ పలు సార్లు లక్షల రూపాయల సాయం అందిస్తూ రియల్‌ హీరో అనిపించుకున్నాడు.

#Chiranjeevi #TNR Died #HeroSampoornesh #@sampoornesh #HeroSampoornesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు