మద్యపానం మూలంగా దేశంలో ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి.తాగుడుకు బానిసై ఎంతో మంది తమ ఫ్యామిలీలను నిలివునా ముంచుకున్న సందర్భాలున్నాయి.
హీరో రోహిత్ కుటుంబం కూడా మద్యపానం మూలంగా ఆగం ఆగం అయ్యింది.తన తండ్రి తాగుబోతు కావడం మూలంగా తాము ఎన్నో కష్టాలు పడ్డట్లు ఆయన వెల్లడించారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రోహిత్ తన కుటుంబానికి చెందిన పలు విషయాలు వెల్లడించాడు.ఇంతకీ తను ఏం చెప్పాడో తెలుసుకుందాం.
జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరో రోహిత్ తెలుగులో ఆయన చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి పేరు సంపాదించుకున్నాడు.తాజాగా తన కుటుంబ విషయాలు బయటకు చెప్పాడు.తన తండ్రి మద్యానికి బానిస అయినట్లు వెల్లడించాడు.రోజు తాగి వచ్చి ఇంట్లో వాళ్లను తీవ్ర ఇబ్బంది పెట్టేవారని చెప్పాడు.తన తాగుబోతు తనం కారణంగా తమ ఆస్తులన్నీ అమ్మోకోవాల్సిన దుస్థితి తలెత్తినట్లు చెప్పాడు.తన తండ్రి చెడు అలవాటు మూలంగా తన తల్లితో పాటు అన్నదమ్ములు ఎన్నో బాధలు పడినట్లు చెప్పాడు.
తన తండ్రి మారేందుకు అమ్మ 100 అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడని చెప్పాడు.అందుకే తను ఇక మారడు అని తెలుసుకుని విడాకులు ఇచ్చినట్లు చెప్పాడు.
ఆ తర్వాత తమకు తండ్రిలేని లోటు తెలియకుండా తన తల్లి పెంచినట్లు చెప్పాడు.
అమ్మ, నాన్న విడిపోయినప్పుడు తన వయసు 14 ఏండ్లు ఉంటుందని చెప్పాడు.భర్త నుంచి విడిపోయిన తర్వాత తమ నైబర్ అయిన ఓ అంకుల్ తమ కష్టాలు తీరేందుకు ఎంతో సాయం చేసినట్లు చెప్పాడు.ఆ తర్వాత తన తండ్రి గురించి మర్చిపోయినట్లు చెప్పాడు.
చాలా కాలం తర్వాత జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమా షూటింగ్ సమయంలో తన తండ్రి తనకు కాల్ చేసినట్లు చెప్పాడు.ఆ తర్వాత మళ్లీ మాట్లాడలేదని వెల్లడించాడు.
తన తండ్రి మూలంగానే తమ కుటుంబం ఇబ్బందులు పడినట్లు చెప్పారు.గతంలో పలు సినిమాల్లో నటించిన రోహిత్ ఆ తర్వాత తెలుగు తెరకు దూరం అయ్యాడు.