శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి డైరక్షన్ లో వచ్చిన సినిమా రాజ రాజ చోర.గురువారం రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.సినిమా చూసిన ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ కూడా తమ స్పందన తెలియచేస్తున్నారు.ఇప్పటికే డైరక్టర్ అనీల్ రావిపుడి సూపర్ అనేయగా లేటెస్ట్ గా మాస్ మహ రాజ్ రవితేజ రాజ రాజ చోర సినిమా చూసి సూపర్ అనేశాడు.రాజ రాజ చోర సినిమా చూశాను.
ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ మూవీ.చాలా ఎంజాయ్ చేశాను.
శ్రీవిష్ణు, డైరక్టర్ హసిత్ గోలి అండ్ టీం అందరికి కంగ్రాట్స్ అని రవితేజ ట్వీట్ చేశారు.
మాములుగా అయితే రవితేజ ఇతర హీరోల సినిమాలు చూసి ట్వీట్ చేయడం చాలా అరుదు.
అలాంటిది శ్రీ విష్ణు రాజ రాజ చోర సినిమా చూసి సూపర్ అనేశాడు.రవితేజకి నచ్చింది అంటే సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అయినట్టే.

మొదటి సినిమానే అయినా హసిత్ గోలి సినిమాను చాలా బాగా తీశాడని చెప్పుకుంటున్నారు.పీపుల్స్ మీడియా, అభిషేక్ పిక్చర్స్ కలిసి ఈ సినిమా నిర్మించారు. రాజ రాజ చోర సినిమాతో శ్రీవిష్ణు ఖాతాలో ఒక హిట్ ప>డ్డది..