రానా ఇన్ని సినిమాలను రిజెక్ట్ చేసాడా.. ఇవి చేసి ఉంటే సూపర్ స్టార్ అయ్యేవాడుగా?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో నటనకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నాడు దగ్గుబాటి రానా. అయితే భారీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ ప్రేక్షకులను ప్రతి పాత్రతో ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు.

 Hero Rana Rejected Movies List Details, Hero Rana, Raja Rejected Movie, Oruvan,-TeluguStop.com

అయితే భాషతో సంబంధం లేకుండా ఎన్నో అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా ఉన్నాడు రానా.అయితే రానాకు ఎంతో మంది దర్శకుల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికి నో చెప్పాడట.

ఇలా ఇప్పటి వరకూ రానా రిజెక్ట్ చేసిన సినిమాల లిస్టు పెద్దగానే ఉంది అని తెలుస్తుంది.ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

తమిళ్ లో తని ఒరువన్ సినిమాలో హీరోగా నటించే అవకాశం రానాకు వచ్చిందట.ఈ సినిమా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కింది.

ఇక రానా రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా లో జయం రవి హీరోగా నటించాడు.బిజీగా ఉండటం వలన ఈ సినిమాను రిలీజ్ చేసాడట రానా.

కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం పటాస్. 2005 లో వచ్చిన ఈ సినిమా ముందుగా దర్శకుడు అనిల్ రావిపూడి రానాతో తెరకెక్కించాలని కథ వినిపించాడట.

కానీ అనిల్ రావిపూడి కొత్త దర్శకుడు కావడం మరో వైపు రానా డేట్స్ కూడా ఖాళీ లేకపోవడంతో ఈ సినిమాకి నో చెప్పేసాడట.

Telugu Krish, Teja, Dulquer Salman, Rana, Kalyan Ram, Milind Rao, Oruvan, Pataas

వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి.అయితే నాని తో తీసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాను తెరకెక్కించి దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించాడు.అయితే ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో సినిమా తీస్తున్నాడు.

ఇక ఈ సినిమా ముందుగా రానాతో చేయాలని అనుకున్నాడట.ఇక పిరియాడికల్ రామా లో రానా అయితే సరిగ్గా సరిపోతాడని భావించాడట.

కానీ రానా ఈ సినిమాకి నో చెప్పాడట.

Telugu Krish, Teja, Dulquer Salman, Rana, Kalyan Ram, Milind Rao, Oruvan, Pataas

క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా కృష్ణం వందే జగద్గురు సినిమా వచ్చింది.అయితే ఇక రానా తో మరో సినిమా చేయాలని కథ రాసుకున్నాడట కృష్ జాగర్లమూడి.రాయబారి అనే కథను రాసుకుని ముందుగా రానాకు కథ వినిపించగా నో చెప్పాడట.

ఆ తర్వాత ఇదే కథను వరుణ్ తేజ్ కు వినిపించగా అతను కూడా రిజెక్ట్ చేయడంతో ఈ స్క్రిప్ట్ ను పక్కన పెట్టేసాడట క్రిష్.

డైరెక్టర్ తేజ రానా కాంబినేషన్లో నేనే రాజు నేనే మంత్రి సినిమా వచ్చింది.

అయితే ఇక ఈ సినిమా తర్వాత తేజ తెరకెక్కించిన సీత సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి బదులుగా రానా ను తీసుకోవాలని అనుకున్నాడుట తేజ.కానీ ఆ సమయంలో రానా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడంతో అది కుదరలేదట.

Telugu Krish, Teja, Dulquer Salman, Rana, Kalyan Ram, Milind Rao, Oruvan, Pataas

బాబాయ్ వెంకటేష్ అబ్బాయి రానా కలిసి మల్టీస్టారర్ చేయాలని అనుకున్నారు.ఈ క్రమంలోనే తమిళ సినిమా విక్రమ్ వేద తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు.కానీ ఈ ప్రాజెక్టుకు రానా నో చెప్పేశాడట.

రానా రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో డిపార్ట్మెంట్ అనే సినిమా వచ్చింది.తర్వాత రానా తో మరో రెండు సినిమాలు చేయాలని అనుకున్నారట వర్మ.కానీ వర్మ చెప్పిన కథ లకు రానా నో చెప్పేశాడట.

Telugu Krish, Teja, Dulquer Salman, Rana, Kalyan Ram, Milind Rao, Oruvan, Pataas

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడితో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడట రానా.కానీ ఈ సినిమా అనుకోని కారణాలవల్ల ఆగిపోయినట్లు తెలుస్తోంది.కాగా ఇప్పటి వరకూ సొంత ప్రొడక్షన్స్ లో రానా చేసింది నేనే రాజు నేనే మంత్రి అనే ఒక్క సినిమా మాత్రమే.

గృహం లాంటి ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టిన దర్శకుడు మిలింద్ రావు.

రానా కి ఒక కథ వినిపించాడట.హిందీ తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నాడట.

ఆ సమయం లో అనారోగ్యంతో అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రానా మిలింద్ రావు సినిమా మిస్ అయ్యాడు.ఇలా రానా కెరీర్లో ఎన్నో సినిమాలను మిస్ అయ్యాడు.

అవన్నీ చేసి ఉంటే ఇప్పుడు వరకు సూపర్స్టార్ అయ్యేవాడు అని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube