ఆ హీరోయిన్ తో ఎఫైర్ పై రానా సంచలన వ్యాఖ్యలు..?

సినిమా ఇండస్ట్రీలో ఒకటి, రెండు సినిమాల్లో కలిసి నటిస్తే చాలు ఆ హీరో హీరోయిన్ మధ్య ఏదో ఉందని గాసిప్స్ తెగ వైరల్ అవుతుంటాయి.కొంతమంది సెలబ్రిటీలు ఇలాంటి గాసిప్స్ గురించి పెద్దగా పట్టించుకోకపోయినా ఇంటర్వ్యూలో ఆ గాసిప్స్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురై ఆ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి.

 Hero Rana Comments About Bipasa Basu Dating Rumours, Abhishek Bachhan, Bipasha B-TeluguStop.com

యంగ్ హీరో రానా సినిమా ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టిన రోజు నుంచి కొంతమంది హీరోయిన్లతో రానాకు ఎఫైర్ ఉందని జోరుగా ప్రచారం జరిగింది.

కెరీర్ మొదట్లో రానా తెలుగుతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు.

రానా హిందీలో బిపాషా బసుతో కలిసి దమ్ మారో దమ్ అనే సినిమాలో నటించారు.ఈ సినిమాలో దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్ లు సైతం కీలక పాత్రల్లో నటించారు.

దమ్ మారో దమ్ సినిమాలో రానా, బిపాషా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి.దీంతో ఆ సినిమా షూటింగ్ సమయంలో, సినిమా విడుదలైన తరువాత రానా, బిపాషా మధ్య ఏదో ఉందని వార్తలు వినిపించాయి.

Telugu Bipasha Basu, Dam Maro Dam, Rana-Movie

సినిమా విడుదలై చాలా సంవత్సరాలు అయినా ఇప్పటికీ రానాకు బిపాసా బసుకు సంబంధించిన ప్రశ్నలు ఇంటర్వ్యూల్లో ఎదురవుతున్నాయి.ఒక సందర్భంలో రానా స్పందిస్తూ దమ్ మారో దమ్ సినిమాలో నటించిన బిపాషా బసుతో పాటు మిగతా హీరోహీరోయిన్లు తనకు మంచి స్నేహితులని రాబోయే సంవత్సరాల్లో కూడా వాళ్లు తన స్నేహితులుగానే ఉంటారని చెప్పారు.తాను బిపాసాతో డేటింగ్ లో ఉన్నట్టు వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు.

బిపాసాతో కలిసి తిరిగినంత మాత్రాన, ఆమెతో మాట్లాడినంత మాత్రాన డేటింగ్ లో ఉన్నారని అనుకోవద్దని రానా వెల్లడించారు.

ప్రస్తుతం రానా అరణ్య, విరాటపర్వం సినిమాలతో బిజీగా ఉన్నారు.వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.రానాకు పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ ఉండటంతో రానా హీరోగా తెరకెక్కుతున్న సినిమాలన్నీ ఒకటి కంటే ఎక్కువ భాషల్లో విడుదల కానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube