అలాంటి కథే కావాలంటున్న రామ్.. గురూజీ అంగీకరిస్తారా..?

ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు సినిమా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాల షూటింగులు ఆగిపోగా ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలు షూటింగ్ లలో పాల్గొంటున్నారు.

 Hero Ram Wants Julayi Type Of Movie From Trivikram Srinivas, Hero Ram, Trivikram-TeluguStop.com

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా అన్నీ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే 2021 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
దీంతో ఎన్టీఆర్ తో ఒక సినిమా తెరకెక్కించాలని అనుకున్న త్రివిక్రమ్ కు సమస్యలు ఎదురవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యే వరకు ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ ఒకే లుక్ తో ఉండాలని రాజమౌళి భావిస్తున్నాడు.దీంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదు.

దీంతో త్రివిక్రమ్ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యే లోపు రామ్ తో ఒక సినిమాను తెరకెక్కించే దిశగా అడుగులు పడుతున్నాయి
గతంలో త్రివిక్రమ్ రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ కు రామ్ తో ఒక సినిమా తెరకెక్కిస్తానని త్రివిక్రమ్ ఒప్పుకున్నారని అందువల్లే తివిక్రమ్ రామ్ తో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.గతంలో నితిన్ తో అ ఆ సినిమాను తెరకెక్కించిన విధంగానే ఈ సినిమాను కూడా 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావిస్తున్నారు.

అయితే రామ్ త్రివిక్రమ్ ను జులాయి లాంటి సినిమా కావాలని కోరాడని తెలుస్తోంది.
అల్లు అర్జున్ తివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన జులాయి సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

త్రివిక్రమ్ హీరో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దడం ఆ సినిమా సక్సెస్ కు కారణమైంది.అయితే ఇలాంటి కథనే కావాలనే రామ్ కోరుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ ఏ విధంగా ముందుకెళతాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube