సిక్స్ ప్యాక్ చూపిస్తున్న ఇస్మార్ట్ శంకర్!  

ఇస్మార్ట్ శంకర్ కోసం సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తున్న హీరో రామ్. .

Hero Ram Show Up Six Pack Body In Ismart Shankar Movie-hero Ram. Six Pack Body. Ismart Shankar Movie. Tollywood,puri Jagan

  • కమర్షియల్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ కి జోడీగా నాభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇక ఈ సినిమాని పూరీ తన స్టైల్ లో మాసివ్ కమర్షియల్ జోనర్ లోనే తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఇదిలా వుంటే పూరీ సినిమా ఎంత వేగంగా షూటింగ్ జరుపుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో రామ్ ని మెమొరీ లాస్ హీరోగా పూరీ రిప్రెజెంట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

  • ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రామ్ కెరియర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ మాసివ్ లుక్ లోకి మారుతున్నాడు. కెరియర్ తొలినాళ్ళలో చేసిన జగడం తప్ప ఇప్పటి వరకు రామ్ మాస్ ఎలిమెంట్స్ తో ఉన్న సినిమా చేయలేదు. అతను చేసిన సినిమాలన్ని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో నడిచినవే. ఇదిలా వుంటే మొదటి సారి పూరీ జగన్నాథ్ తో చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ కోసం రామ్ ఏకంగా షర్టు విప్పి కండలు చూపించడానికి రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ కి సిక్స్ ప్యాక్ ని పరిచయం చేసిన దర్శకుడుగా గుర్తింపు ఉన్న పూరీ ఇస్మార్ట్ శంకర్ లో రామ్ తో కూడా షర్టు విప్పించడానికి రెడీ అయ్యారు. మరి కెరియర్ లో సాలిడ్ హిట్ లేక మోస్తరు హీరోగా ఉండిపోయిన రామ్ కి ఈ ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుంది అనేది వేచి చూడాల్సిందే.