ఇస్మార్ట్ డేవిడ్ వార్నర్ పై హీరో రామ్ కామెంట్స్..!  

లాక్ డౌన్ సమయంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.టిక్ టాక్ ఉపయోగించి తనదైన శైలిలో తన భార్యతో కలిసి టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన పాటలను ఎంచుకొని డాన్స్ చేస్తూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

TeluguStop.com - Hero Ram Sensational Comments On David Warner Ismart Look

కేవలం పాటలు మాత్రమే కాదు సినిమా డైలాగులు చెబుతూ కూడా తెలుగు వారికి మరింతగా దగ్గరయ్యాడు డేవిడ్ వార్నర్.ఇది వరకు మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో లను అనుసరించిన డేవిడ్ వార్నర్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్, హీరో రామ్ లను కూడా అనుకరించడం మొదలుపెట్టాడు.

తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కత్తితో ఉన్న సీన్ ను మార్ఫింగ్ చేసి తన ఫేస్ ను జత పరిచాడు.

TeluguStop.com - ఇస్మార్ట్ డేవిడ్ వార్నర్ పై హీరో రామ్ కామెంట్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత తాజాగా మరోసారి ఇస్మార్ట్ శంకర్ లో హీరో రామ్ ఫేస్ ను మార్ఫింగ్ చేసి తన ఫేస్ ను పెట్టి వీడియో విడుదల చేశాడు.

దీన్ని బట్టి చూస్తే డేవిడ్ వార్నర్ ఇంకా తెలుగు సినిమాలను వదిలేయలేదని ఇట్టే అర్థం అవుతుంది.తాజాగా డేవిడ్ వార్నర్ పోస్ట్ చేసిన దానిలో అచ్చం ఇస్మార్ట్ శంకర్ లా మారిపోయినట్లుగా డేవిడ్ వార్నర్ తన యాటిట్యూడ్ ను ప్రదర్శించాడు.

ఇందుకు సంబంధించి ఈ స్మార్ట్ డేవిడ్ గా మారిపోయిన తనను ఎవరు గుర్తుపట్టలేరు అంటూ ఫన్నీ కామెంట్ ను కూడా జతపరిచాడు.అయితే ఈ కామెంట్ కు సంబంధించి ఆ సినిమాలో నటించిన హీరో రామ్ డేవిడ్ వార్నర్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.

డేవిడ్ వార్నర్ చేసిన ఆ వీడియో చూసిన రామ్ కాస్త వెరైటీగా సమాధానమిచ్చాడు.రామ్ సమాధానమిస్తూ.అవును, అతను ఎవరో గుర్తు పడటం చాలా కష్టంగా ఉందని తెలిపాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇదివరకు ఎన్నో తెలుగు సినిమాల్లోని పాటలకు డాన్సులు వేస్తూ, తెలుగు సినిమాల్లోని డైలాగులకు డబ్స్ స్మాష్ చెబుతూ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు.ముఖ్యంగా అలా వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ పాటకు వేసిన స్టెప్పులు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.

ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో డేవిడ్ వార్నర్ మన టాలీవుడ్ లో కనిపించే అవకాశం లేకపోలేదు.

#HeroRam #Ismart Shankar #Social Media #Viral #David Warner

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు