వాళ్లతోనే అసలైన పోటీ అంటున్న రామ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని దేవదాసు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయాలను సొంతం చేసుకుని ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఊపు మీదున్న రామ్ తాజాగా “రెడ్ “ అనే సినిమా ద్వారా మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్నారు.

 Hero Ram ,real Competition , Success Meet , Red Movie, Vizag, Hero Ram At Red Mo-TeluguStop.com

ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరో రామ్ మాట్లాడుతూ…
శనివారం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో రెడ్ చిత్రం విజయోత్సవాన్ని గురజాడ కళాక్షేత్రంలో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి నాకు ఎవరు పోటీ లేరు.కానీ ఇప్పటి నుంచి నాకు అభిమానులతో పోటీ అని తెలిపారు.

అభిమానులు తనను ఆదరించడంలో తనతో పోటీ పడుతున్నారని,నేను కూడా మంచి సినిమాలు చేసి వారి అభిమానానికి పోటీ ఇస్తానని, ఇప్పటినుంచి నాకు పోటీ అభిమానులేనని ఈ సందర్భంగా తెలియజేశారు.

Telugu Ram, Malavika Sharma, Red, Red Public, Red Review, Meet, Vizag-Movie

లాక్ డౌన్ తరువాత రామ్ హీరోగా హీరోయిన్ మాళవిక శర్మ జతకట్టి నటించిన రెడ్ చిత్రం తాజాగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ చిత్రం హిట్ టాక్ వినిపించడంతో సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టం మొత్తం మరిచిపోయాము.ఈ విధంగా మరోసారి తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలను తెలియజేశారు.

ఈ సినిమా విజయోత్సవ వేడుకలో భాగంగా హీరోయిన్ మాళవిక శర్మ, దర్శకుడు తిరుమల కిషోర్, నిర్మాత కృష్ణ పోతినేని శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube