ఓటీటీ బాట పడుతున్న రామ్ – కిషోర్ తిరుమల రెడ్ మూవీ  

hero Ram Red movie Release in OTT, Hero Ram, Kishore Tirumala, OTT platform, Tollywood, Digital Entertainment - Telugu Digital Entertainment, Hero Ram, Hero Ram Red Movie Release In Ott, Kishore Tirumala, Ott Platform, Tollywood

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూత పడటంతో ఇప్పటికే సినిమాలు కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ అయ్యి ఉన్న నిర్మాతల పరిస్థితి దారుణంగా తయారైంది.కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టి తీసిన సినిమాలు థియేటర్ లో పడితే వాటికి సంబందించిన సొమ్ములు వస్తాయి.

 Hero Ram Red Movie Release In Ott

అలా అయితే సినిమా మీద తీసుకున్న ఫైనాన్స్ మళ్ళీ సకాలంలో చెల్లించవచ్చు లేదంటే వడ్డీలు పెరిగిపోతాయి.దీంతో నిర్మాతలు ఈ కరోనా సమయంలో తమకి ప్రత్యామ్నాయంగా దొరికిన ఒటీటీ చానల్స్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు.

సదరు డిజిటల్ చానల్స్ కూడా నిర్మాతలకి సినిమా రైట్స్ రూపంలో భారీగానే ముట్టజెప్పడంతో నిర్మాతలు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా సినిమాలని అమ్మేస్తున్నారు.ఈ నేపధ్యంలో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఒటీటీలో రిలీజ్ అయిపోతున్నాయి.

ఓటీటీ బాట పడుతున్న రామ్ – కిషోర్ తిరుమల రెడ్ మూవీ-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలకి కలెక్షన్ కూడా భాగానే వస్తుంది.సినిమా చూడటానికి పే ఆప్షన్ పెట్టడంతో భారీగానే ఆదాయం ఒటీటీ చానల్స్ కి వస్తుంది.

ఈ నేపధ్యంలో తాజాగా సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు సినిమాకి ఒటీటీ నుంచి 25 కోట్లు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలోని హై ఎనర్జీని చూపించిన రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా రెడ్ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.ఇక ఈ సినిమాకి ప్రముఖ ఒటీటీ చానల్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.

సినిమాకి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు సొమ్ము రైట్స్ రూపంలో ఇవ్వడానికి ముందుకొచ్చారని తెలుస్తుంది.ముందుగా సినిమాని థియేటర్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు, హీరో రామ్ భావించిన ప్రస్తుత పరిస్థితిలో ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేయడానికి అవకాశం లేకపోవడంతో అన్ని ఆలోచించుకొని ఈ సినిమాని ఒటీటీలో రిలీజ్ చేయడానికి మొగ్గు చూపిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

#OTT Platform #Hero Ram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Ram Red Movie Release In Ott Related Telugu News,Photos/Pics,Images..