రెడ్ టీజర్ టాక్ : లైఫ్ లో ఇదే ఫస్ట్ టైమ్ అంటున్న రామ్...

గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరో రామ్ పోతినేని ఈ సారి ప్రేక్షకుల ముందుకు  సరి కొత్త కథనంతో రానున్నాడు.ఇందులో భాగంగా ప్రస్తుతం రామ్ పోతినేని “రెడ్” అనే చిత్రంలో నటిస్తున్నాడు.

 Hero Ram Pothineni Red Movie Teaser Talk-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో హీరో రామ్ సరసన మాళవిక శర్మ, నివేదా పేతురాజ్, అమృత అయ్యర్, హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి 1.20 నిమిషాల నిడివిగల టీజర్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.ఈ టీజర్ ని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ చిత్రంలో రామ్ డద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

అంతేగాక ఈ చిత్రం పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే కథనం గా ఉన్నట్లు తెలుస్తోంది.అంతేగాక రామ్ ఈ చిత్రంలో క్లాస్ మరియు మాస్ రెండు పాత్రల్లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో నివేద పేతురాజ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.అంతేకాక టీజర్ మధ్యలో వచ్చే ట్విస్ట్ లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఏదేమైనప్పటికీ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో హిట్ ట్రాక్ లో పడ్డ రామ్ పోతినేని మరో సరికొత్త ప్రయోగం చేస్తూ ఇంకో హిట్ ని తన ఖాతాలో వేసుకునేందుకు బాగానే శ్రమిస్తున్నాడు.

అయితే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు సమాచారం.దీంతో దర్శకుడు తిరుమల కిషోర్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube