బాలయ్య కోసం వెనక్కి తగ్గనున్న బోయపాటి.. పాపం రామ్ ఆశలు గల్లంతే!

ఎనర్జిటిక్ స్టార్ రామ్( Ram Pothineni ) కథానాయకుడిగా శ్రీలీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”RAPO20”. ప్రెజెంట్ పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.రామ్ పోతినేని తో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

 Hero Ram Pothineni Boyapati Rapo20 Update Details, Rapo20, Ram Pothineni, Boyapa-TeluguStop.com

టైర్ 2 హీరోల్లో 50 కోట్లకు పైగానే బడ్జెట్ తో సినిమాలు చేస్తుండడం అయినా భారీ కలెక్షన్స్ రాబట్టడంలో వీరికి కూడా బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు.పైగా బోయపాటి అంటే మినిమమ్ ఆ రేంజ్ లో ఉండాలి.

ఇక ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.మరి ఇదే సమయంలో రవితేజ కూడా పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు తో రాబోతున్నాడు.

అయితే ఈ ఇద్దరి స్టార్ హీరోల ఆశలపై బాలయ్య ( Balakrishna ) నీళ్లు చల్లాడు.ఈయన కూడా తన లేటెస్ట్ సినిమాతో దసరాకు రాబోతున్నట్టు అనౌన్స్ చేసి వీరికి షాక్ ఇచ్చాడు.ఇక ఈ ముగ్గురు ఒకే సమయంలో వస్తే అది కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.అందుకే ఎవరో ఒకరైన వెనక్కి తగ్గితేనే భారీ నష్టం వాటిల్లకుండా కాపాడు కోవచ్చు.

మరి బాలయ్య కోసం బోయపాటి నే వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తుంది.

తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం రామ్ సినిమానే వెనక్కి తగ్గే ఛాన్స్ ఉండవచ్చని.రవితేజ అయితే ఈ పోటీలో వెనక్కి తగ్గే ఛాన్స్ లేదని అంటున్నారు.బోయపాటికి బాలకృష్ణకు మధ్య ఉన్న అనుబంధం కారణంగా రామ్ సినిమా తగ్గక తప్పడం లేదని.

పండుగ సీజన్ లో రామ్ సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా వ్యాప్తంగా నిరూపించుకోవాలని చూస్తుంటే ఈయన ఆశలపై అందరు నీళ్లు చల్లుతున్నట్టు అనిపిస్తుంది.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube