కోలీవుడ్ దర్శకుడుతో రామ్ నెక్స్ట్ మూవీ  

ఎనర్జిటిక్ స్టార్ గా టాలీవుడ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు రామ్ పోతినేని.ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ పూర్తిగా గేర్ మార్చేశాడు.

TeluguStop.com - Hero Ram Next Movie With Kollywood Director

రెగ్యులర్ మూస కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి క్యారెక్టరైజేషన్ కోసం తన లుక్ కూడా పూర్తిగా మార్చేసుకుంటూ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.లవ్ బాయ్ లుక్ లో ఎన్ని సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ వచ్చిన స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ రావడం లేదని, సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు.

అందులో భాగంగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన ఎనర్జీ లెవల్స్ లో హై ఓల్టేజ్ లో ఉపయోగించిన రామ్ ఈ సారి డ్యూయల్ రోల్ లో రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.ఈ సినిమాలో ఒక పాత్ర పూర్తి నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని తెలుస్తుంది.

TeluguStop.com - కోలీవుడ్ దర్శకుడుతో రామ్ నెక్స్ట్ మూవీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ ఏ దర్శకుడుతో సినిమా చేస్తాడనే టాక్ ప్రస్తుతం నడుస్తుంది.

ఓ కోలీవుడ్ దర్శకుడుతో రామ్ నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

తమిళంలో స్టార్ హీరో విజయ్ తో జిల్లా అనే సినిమాని గతంలో నేసం తెరకెక్కించాడు.ఆ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఇప్పుడు ఆ దర్శకుడు చెప్పిన ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్ రామ్ కి నచ్చడంతో అతనితో సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.ఈ సినిమాని తన పెదనాన్న స్రవంతి రవికిశోర్ నిర్మిస్తారని టాక్.

రెడ్ సినిమా రిలీజ్ తర్వాత ఆ సినిమా గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

#R. T. Neason

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Ram Next Movie With Kollywood Director Related Telugu News,Photos/Pics,Images..