కరోనా కట్టడి కోసం సూపర్ మ్యాన్ అయిన హీరో రామ్!

మనకు ఏమీ తెలియాక పోయినా పరిస్థితులు అన్నీ నేర్పుతాయి అని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు.నిజంగా ఈ కరోనా ఏ క్షణాన దాపురించిందో కానీ చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి శుభ్రతలు పాటించాలి,ఎవరితో ఎలా మెలగాలి అన్న విషయాలు ఇట్టే అర్ధం చేసుకొని పాటించాల్సి వస్తుంది.

 Hero Ram Pothineni Wearing Mask Video Goes On Viral, Ram Pothineni , Mask, Ram W-TeluguStop.com

ఈ మహమ్మారి ని కట్టడి చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా సామజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది.దీనితో సామాన్యుడు,సెలబ్రిటీ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా యుద్దానికి వెళుతున్నట్లు అన్ని జాగ్రత్తలతో కూడిన మాస్కులు,చేతికి గ్లౌజ్ లు ఇలా తమకు తోచిన వాటిని ధరిస్తూ బయటకు వెళ్లాల్సి వస్తుంది.

అయితే ఇలా కరోనా ను కట్టడి చేయడం కోసం టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ఒక సరికొత్త ట్రిక్ చెప్పాడు.

పూర్తిగా కప్పి ఉంచే ఒక టీ షర్ట్ ధరించి అందరిని ఆకర్షించాడు.

తల భాగం వరకు పూర్తిగా కప్పి ఉండే ఈ టీ షర్ట్ వేసుకొని రామ్ అందరిని ఆకర్షించాడు.సూపర్ మ్యాన్ లాంటి డ్రెస్ వేసుకొని వీడియో తీసి తాను ఎలా వైరస్ నుంచి రక్షణ పొందుతున్నాడో తెలియజేశాడు.

ఇలాగే అందరూ జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చాడు.అయితే ఇంకేముంది మన తెలుగు హీరోలు ఏదైనా చేస్తే నెటిజన్లు వాటిని యిట్టె వదిలేస్తారా తమ తాము చేసుకుపోతున్నారు.

దీనితో ఈ వీడియో కు విపరీతమైన లైక్ లతో పాటు షేర్ చేయడం తో ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.రామ్ చెప్పినట్లు చేస్తే కరోనా కాదు కదా.దాని తాత కూడా ఎవర్నీ ఏమి చేయదని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

అయితే రామ్ వేసుకున్న ఈ కరోనా మాస్క్ చిన్న పిల్లలు చూస్తే మాత్రం తప్పనిసరిగా ఆ టీ షర్ట్ కావాలని గోల చేయక మానరు అని చెప్పాలి.

మొత్తానికి కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఎన్నెన్నో నేర్చుకోవాల్సి వస్తుంది.ఒకవేళ ఒకప్పుడు ఎలాంటి వైరస్ లు సోకకూడదు అనేమో స్పైడర్ మ్యాన్,సూపర్ మ్యాన్ లు ఇలాంటి డ్రస్ లు వేసుకున్నారేమో మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube