యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తున్న దిమాక్ ఖరాబ్ సాంగ్  

Hero Ram iSmart Shankar song trend in YouTube, Tollywood, Telugu cinema, Mani Sharma, Sekhar master - Telugu Hero Ram Ismart Shankar Song Trend In Youtube, Mani Sharma, Sekhar Master, Telugu Cinema, Tollywood

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్.వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్టు బొమ్మకి మొహం వాచిపోయిన రామ్ కి ఇస్మార్ట్ శంకర్ ఈ సినిమాతో పెద్ద బూస్టింగ్ వచ్చింది అని చెప్పాలి.

 Hero Ram Ismart Shankar Song Trend In Youtube

ఈ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు తన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ రికార్డు కూడా క్రియేట్ చేశారు.వరుస ఫ్లాప్ లతో ఉన్న పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమా బౌన్స్ బ్యాక్ అయ్యారు.

పూరి స్టైల్ లోనే కొనసాగే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో సాంగ్స్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి.మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు అన్నీ కూడా మాస్ ప్రేక్షకులను అలరించాయి.

యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తున్న దిమాక్ ఖరాబ్ సాంగ్-Movie-Telugu Tollywood Photo Image

స్టార్ దర్శకుడు మణిశర్మ కూడా ఈ సినిమా వాళ్ల బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలోని ఓ వీడియో సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

రామ్ ఇద్దరు హీరోయిన్ లతో కలిపి చేసిన దిమాక్ ఖరాబ్ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.ఈ వీడియో సాంగ్ ఏకంగా 120 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.

తెలుగులో ఇప్పటి వరకు సాయి పల్లవి సినిమా పాటలకు యూట్యూబ్ లో అత్యధిక ప్రజాదరణ ఉంది.ఇప్పుడు ఈ సాంగ్ తో రామ్ కూడా సోషల్ మీడియాలో తన సత్తా చాటాడు.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ లో హీరో రామ్ డాన్స్ పరంగా కూడా ఇరగదీసాడని చెప్పాలి.దీంతో ఇప్పుడు ఈ వీడియో సాంగ్ చాలా వేగంగా 120 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది.

#Sekhar Master #Mani Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Ram Ismart Shankar Song Trend In Youtube Related Telugu News,Photos/Pics,Images..