టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో హీరో రామ్ ఒకరనే సంగతి తెలిసిందే.గతేడాది లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో చాలామంది సెలబ్రిటీల పెళ్లిళ్లు జరగడంతో పెళ్లి కాని హీరోహీరోయిన్లకు ఇంటర్వ్యూల్లో పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదురవుతున్నాయి.
ప్రస్తుతం హీరో రామ్ వయస్సు 32 సంఫత్సరాలు కాగా రెడ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రామ్ కు కూడా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అయితే రామ్ మాత్రం ఇతర హీరోహీరోయిన్లు చెప్పే మాటలకు భిన్నంగా “పెళ్లి మన చేతిలో ఉండదు.
పెళ్లి తర్వాత ఏదీ మన చేతిలో ఉండదు” అంటూ మీడియా ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సమయం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందని రామ్ చెప్పకనే చెప్పేశారు.అయితే రామ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు.2019లో ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ అందుకున్న రామ్ ఈ ఏడాది రెడ్ సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాలా రామ్ రెడ్ సినిమాకు కూడా పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు.అయితే టాక్ పాజిటివ్ గా లేకపోయినా కలెక్షన్ల విషయంలో మాత్రం రామ్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.రామ్ రెడ్ సినిమాకు తొలిరోజే ఏకంగా 6.7 కోట్ల రూపాయల షేర్ దక్కింది.బాక్సాఫీస్ దగ్గర క్రాక్ మినహా పెద్దగా పోటీ లేకపోవడంతో రెడ్ మూవీ త్వరగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో ఇంటర్య్వూలో కూడా రామ్ కు మీ సీతను ఎప్పుడు పరిచయం చేస్తారనే ప్రశ్న ఎదురు కాగా నాకు పరిచయం అయినప్పుడే చేస్తానని రామ్ వ్యాఖ్యలు చేశారు.
వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్న రామ్ భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో కూడా నటించనున్నారని తెలుస్తోంది.రామ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.