రామ్‌ కెరీర్‌ మళ్లీ అదే ఒడిదుడుకులు, లాజిక్ మిస్‌ అవుతున్న యంగ్‌ హీరో

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్ హీరోగా పరిచయం అయ్యి మొన్నటి సంక్రాంతికి 15 ఏళ్లు పూర్తి అయ్యింది.దేవదాస్ మూవీ వచ్చి అప్పుడే 15 ఏళ్లు అయ్యిందా అన్నట్లుగా ఉంది అంటూ రామ్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.

 Hero Ram Ignoring Main Issue About Story When Doing Movies, Hero Ram, Ram Cine C-TeluguStop.com

అంత స్పీడ్‌ గా ఆయన కెరీర్‌ ఉందా అంటే అనుమానమే అన్నట్లుగా అభిమానులు సైతం నీళ్లు నములుతున్నారు.అద్బుతమైన సినీ కెరీర్ ను రామ్‌ కొనసాగించాడా అంటే లేదు అనే సమాధానం వస్తుంది.

15 ఏళ్ల సినీ కెరీర్ లో రామ్‌ సాధించిన విజయాలు తక్కువే.ఆయన మూట కట్టుకున్న పరాజయాలు మరీ ఎక్కువ.

ఆ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.అయితే వచ్చిన సక్సెస్‌ లతో ఆయన కెరీర్‌ ను బిల్డ్‌ చేసుకుంటూ వచ్చాడు.

ఇక గత సినిమా ఇస్మార్ట్ శంకర్ తో సూపర్‌ హిట్‌ అందుకున్న రామ్‌ ఇప్పుడు సంక్రాంతికి ‘రెడ్‌’ సినిమాతో వచ్చి నిరాశ పర్చాడు.ఏమాత్రం ఆకట్టుకోని కథనం అంటూ విమర్శలు వస్తున్నాయి.

Telugu Ramyears, Cine Career, Ram, Ram Story, Ram Red, Ismart Shankar, Ram Cine

రామ్‌ ఒక సినిమా హిట్‌ రెండు మూడు ఫట్‌ అన్నట్లుగా కెరీర్ ఒడిదుడుకుల మద్య కొనసాగుతుంది.ఇలాంటి సమయంలో ఆయన కథ విషయంలో చిన్న లాజిక్కులు మిస్ అవుతున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా షూటింగ్‌ సమయం నుండే రామ్‌ సినిమా ఆహా ఓహో అన్నట్లుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు.కాని ప్రారంభం సమయంలో కథ విషయంలో రామ్‌ మరింత జాగ్రత్తలు తీసుకోవడం దర్శకుడు మరియు ఇతర విషయాలను గురించి కాస్త జాగ్రత్తగా ఆలోచించడం మంచిది.

రెడ్‌ సినిమాకు కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించాడు.ఆయనతో ఇప్పటికే రామ్ రెండు సినిమాలు చేశాడు.ఆ రెండు పర్వాలేదు అనిపించుకున్నాయి.మరి అలాంటి సినిమాలనే మళ్లీ ఆ దర్శకుడితో చేయాలి.

కాని మరో కొత్త ప్రయోగం చేయడం అనేది ప్రయోగం అవుతుంది.ఆ ప్రయోగ ఫలితం తేడా కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయం ఆయన గుర్తించాలి.

కాని ఆ విషయం పట్ల రామ్‌ కు పెద్దగా ఆసక్తి ఉన్నట్లుగా అనిపించలేదు.దాంతో రామ్‌ ప్రయోగం చేయడం అది కాస్త బెడిసి కొట్టడం జరిగింది.

ముందు ముందు అయినా రామ్ కథ కు తగ్గ దర్శకుడిని తనకు తగ్గ కథను ఎంపిక చేసుకోవాలని అభిమానుల నుండి రిక్వెస్ట్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube