మొదటి సారి పోలీస్ ఆఫీసర్ గా చేయబోతున్న ఇస్మార్ట్ రామ్

ఎనర్జిటిక్ స్టార్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు రామ్.దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రామ్ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా తనకి సరిపోయే కథలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.

 Hero Ram First Time Play Police Officer Role-TeluguStop.com

అయితే అతని కెరియర్ లో సక్సెస్ లు అనేవి అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తున్నాయే తప్ప నిలకడగా రావడం లేదు. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ తరువాత రెడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 Hero Ram First Time Play Police Officer Role-మొదటి సారి పోలీస్ ఆఫీసర్ గా ఇస్మార్ట్ రామ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పక్కా మాస్ కమర్షియల్ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. క్రేజీ బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో రామ్ కి జోడీగా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర అప్డేట్ తాజాగా బయటకొచ్చింది.

ఈ సినిమాలో రామ్ మొదటి సారి ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

రామ్ కెరియర్ ఇప్పటి వరకు రొటీన్ తరహా పాత్రలే చేస్తూ వచ్చాడు.అయితే ఇస్మార్త్ శంకర్ సినిమా కోసం తనని పూర్తిగా మార్చేసుకొని కొత్త లుక్ తో దర్శనం ఇచ్చాడు.

ఈ నేపధ్యంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ క్యారెక్టరైజేషన్ అయిన పోలీస్ పాత్రతో ఇప్పుడు అలరించడానికి రెడీ అవుతున్నాడు.కమర్షియల్ ఫార్మాట్ లోనే సినిమా కథాంశం ఉన్న కూడా లింగుస్వామి ఈ సినిమా ద్వారా ఓ కొత్త పాయింట్ ని రిప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే పోలీస్ లుక్ కోసం రామ్ కూడా వర్క్ అవుట్స్ చేస్తూ తన బాడీ షేప్స్ మార్చుకుంటున్నట్లు తెలుస్తుంది.

#Role #Ram Pothineni #Linguswamy #Ram Time Role #Krithi Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు