త్రివిక్రమ్ తో సినిమా కన్ఫామ్ చేసిన రామ్.. కానీ..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస విజయాలతో సినిమాసినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

 Hero Ram Confirms Movie With Trivikram Srinivas, Red Movie, Sankranthi Movies,-TeluguStop.com

త్రివిక్రమ్ అయ్యప్పనుమ్ కోషియమ్ స్క్రిప్ట్ లో మార్పులు కూడా చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే గత కొన్ని నెలల నుంచి రామ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమా విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ త్రివిక్రమ్ తో సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తను హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని రామ్ అన్నారు.

Telugu Ram, Jr Ntr, Red-Movie

అయితే త్రివిక్రమ్ డైరెక్షన్ లో తాను ఎప్పుడు నటిస్తాననే విషయం మాత్రం కచ్చితంగా చెప్పలేనని రామ్ పేర్కొన్నారు.మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమాకు ఫిక్స్ కాలేదు.దీంతో ఎన్టీఆర్ తరువాత రామ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ అందుకున్న రామ్ రెడ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని భావిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన రెడ్ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా కావడం, ఒక పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించనుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube