అనిల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్న రామ్

ఎనర్జిటింగ్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.అదే స్పీడ్ తో ఇకపై మరింత కేర్ ఫుల్ గా వీలైనంత వరకు మంచి మాస్ ఇమేజ్ తీసుకొచ్చే సినిమాలే చేయాలని అనుకుంటున్నాడు.

 Hero Ram Commit New Film With Anil Ravipudi, Tollywood, Telugu Cinema, South Cin-TeluguStop.com

ఇప్పటి వరకు ఉన్న క్లాస్ ఇమేజ్ కి దూరం కాకపోతే కమర్షియల్ స్టార్ హీరోగా ఎదగడం కష్టం అని వీలైనంత వరకు కంటెంట్ కొత్తగా ఉండి మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే కథలతో ప్రేక్షకుల ముందుకి రావాలని అనుకుంటున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇదే టైంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కూడా రామ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

అందులో భాగంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

రీసెంట్ గా అనిల్ చెప్పిన కథకి రామ్ ఒకే చెప్పడం జరిగిందని తెలుస్తుంది.ఈ సినిమా ఎఫ్ 3, సాయి పల్లవితో లేడీ ఒరియాంటెడ్ సినిమా పూర్తయిన తర్వాత సెట్స్ పైకి వెళ్తుందనే టాక్ వినిపిస్తుంది.

గతంలో రాజా ది గ్రేట్ మూవీ స్టోరీ ముందుగా అనిల్ రామ్ తో చేయాలని అనుకున్నాడు.అయితే హీరో క్యారెక్టర్ బ్లైండ్ కావడంతో ప్రయోగంగా ఉంటుందని ఆడియన్స్ కనెక్ట్ అవ్వరని రామ్ ఆ సినిమా వదులుకున్నాడు.

అయితే రవితేజతో అనిల్ అదే స్టోరీతో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.అప్పుడు వదులుకున్న అనిల్ ని రామ్ ఈ సారి మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేడని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube