బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రామ్.. నిజమేనా..?  

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా నేడు థియేటర్లలో విడుదల కానుంది.2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ నటించిన రెడ్ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉండగా కరోనా, లాక్ డౌన్ వల్ల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతోంది.తొలిసారి రామ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినాయం చేస్తూ ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

TeluguStop.com - Hero Ram Clarity About His Bollywood Entry

అయితే గత కొంతకాలం నుంచి రామ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

రెడ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రామ్ కు బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురు కాగా రామ్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనకు హిందీలో కూడా మార్కెట్ ఉండటం సంతోషకరమైన విషయం అని.అయితే హిందీ సినిమా చేసే ఆలోచన మాత్రం తనకు లేదని రామ్ పేర్కొన్నారు.

TeluguStop.com - బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రామ్.. నిజమేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image
Telugu Bollywood Entry, Clarity About Rumours, Hero Ram, Red Movie-Movie

ప్రస్తుతం తెలుగులోనే నటిస్తానని రామ్ బాలీవుడ్ ఎంట్రీ గురించి స్పష్టతనిచ్చారు.కొత్త సినిమా విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.ఏదైనా కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు.

ఈరోజు విడుదల కానున్న రెడ్ సినిమాలో రామ్ ఒక పాత్రలో ఊరమాస్ గా మరో పాత్రలో క్లాస్ గా కనిపించనున్నారు.రెడ్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

మరోవైపు రెడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెడ్ మూవీ బిగ్ టికెట్ కు బదులుగా క్రాక్ మూవీ బిగ్ టికెట్ ఉండటం గురించి స్పందిస్తూ తప్పులు జరగడం సహజమని పేర్కొన్నారు.తప్పులను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రామ్ తెలిపారు.

#ClarityAbout #Hero Ram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Hero Ram Clarity About His Bollywood Entry Related Telugu News,Photos/Pics,Images..