రామ్ చరణ్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ ఖరీదెంతంటే..?

స్టార్ హీరో రామ్ చరణ్ వరుస సినిమా కమిట్మెంట్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలలో చరణ్ నటిస్తున్నారు.

 Ram Charan Sun Glasses Photos Goes Viral In Social Media, Ram Charan Sun Glasses-TeluguStop.com

ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా ఆర్ఆర్ఆర్ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.రామ్ చరణ్ ఆచార్య సినిమాలో సిద్ధా అనే పాత్రలో నటిస్తుండగా ఆ పాత్రకు సంబంధించిన లుక్ ఈరోజు ఆచార్య సినిమా నుంచి విడుదలైంది.

2020 సంవత్సరం డిసెంబర్ 27వ తేదీన చరణ్ కరోనా బారిన పడగా కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది.కరోనా నుంచి కోలుకున్న తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫోటోలు దిగగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలలో రామ్ చరణ్ సన్ గ్లాసెస్ తో కనిపించారు.రామ్ చరణ్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ స్టైలిష్ గా ఉన్నాయి.చరణ్ బర్డ్స్ తో సరదాగా గడుపుతున్నారు.

Telugu Rupees, Covid, Ram Charan, Ramcharan, Sun Glasses-Movie

రామ్ చరణ్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ ధర ఏకంగా 40,464 రూపాయలు అని తెలుస్తుంది.ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఉపయోగించే దుస్తులు, వస్తువుల ధరలు వెలుగులోకి వస్తూ అభిమానులు ఆశ్చర్యపోయేలా చేస్తున్న సంగతి తెలిసిందే.రామ్ చరణ్ సన్ గ్లాసెస్ ధర తెలిసి చరణ్ సన్ గ్లాసెస్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారా.? అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆచార్య సినిమాలో చరణ్ లుక్ విడుదల కాగా ఈ లుక్ లో చరణ్ చెవికి పోగు, మెడలో రుద్రాక్షతో కనిపిస్తున్నారు.

ఈరోజు నుంచి చరణ్ ఆచార్య షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాలో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తాడని తెలుస్తోంది.చరణ్, చిరంజీవి కలిసి నటిస్తూ ఉండటతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube