ఆ హీరోయిన్ ను వదలనంటున్న రామ్ చరణ్..?

స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తూ ఆ సినిమాకే పూర్తిగా పరిమితమైన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు.

 Hero Ram Charan Once Again Romance With Alia Bhatt In Shankar Movie, Ram Charan,-TeluguStop.com

చరణ్ అలియా కాంబినేషన్ పోస్టర్ విడుదల కాకపోయినా ఈ జోడీ బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.అయితే రామ్ చరణ్ తరువాత సినిమాలో కూడా హీరోయిన్ గా అలియా ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా అలియా భట్ కే శంకర్ చరణ్ కాంబినేషన్ సినిమాలో ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.మొదట రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ పేరు ఎక్కువగా వినిపించింది.

అయితే చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.అందువల్ల ఈ సినిమాలో అలియా భట్ కు ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.

మరి అలియా మరోసారి చరణ్ తో రొమాన్స్ కు సిద్ధమవుతున్నారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu Alia Bhatt, Cm Role, Ias Role, Kiara Advani, Romance, Ram Charan, Ramchar

మరోవైపు చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తైన వెంటనే శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.శంకర్ గత సినిమాలకు భిన్నంగా గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత లేకుండా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.శంకర్ తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో చరణ్ పాత్రకు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.రామ్ చరణ్ సీఎం రోల్ లో, కలెక్టర్ రోల్ లో ఈ సినిమాలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే అధికారికంగా చరణ్ పాత్ర గురించి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube