మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇదే డ్రీం ప్రాజెక్ట్ అంట !

సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న వారు.ఎప్పటికైనా తమ డ్రీమ్ రోల్స్ చేయాలి అని భావిస్తారు.

 Hero Ram Charan Dream Project , Mega Power Star Ramcharan, Goutham, Dream Projec-TeluguStop.com

అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.సేమ్ ఇలాగే పలు డ్రీమ్ రోల్స్ ఉన్నాయట మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు.త్రిఫుల్ ఆర్ సినిమా తర్వాత దర్శకుడు శంకర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా రాం చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతోంది.

ఈ సినిమా లైన్లోకి వస్తుండగానే.మరో సినిమాకు చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

జెర్సీ సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టిన గౌతమ్ తో కొత్త ప్రాజెక్టు చేసేందుకు రెడీ అవుతున్నాడట.ప్రస్తుతం గౌతమ్ హిందీ రీమేక్ చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత చెర్రీతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా 2022లో సెట్స్ మీదకు వచ్చేఅవకాశం ఉంది.

టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న రాం చరణ్.గౌతమ్ తో సినిమా చేయడానికి చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.గౌతమ్ టేకింగ్ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది.అదే సమయంలో సీరియస్ నెస్ ను బాగా చూపించగల్గుతాడు.

ఆయన సినిమా తీసే విధాననికి ఇంప్రెస్ అయ్యే ఈ సినిమాకు చెర్రీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.అటు ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్ మాన్ గా ఫుల్ లెన్త్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ పాత్ర చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాడట.తన డ్రీమ్ రోల్ కు దగ్గరగా గౌతమ్ కథ ఉండటంతోనే చెర్రీ ఈ సినిమాకు సరే అన్నాడట.

Telugu Dream Project, Goutham, Ramcharan, Ram Charan, Tollywood-Telugu Stop Excl

గౌతమ్, చెర్రీ కాంబోలో తెరకెక్కబోయే ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ నేపథ్యంలో కొనసాగుతుందట.ఈ సినిమాలో చరణ్ మరింత కొత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.మొత్తంగా 2022లో చెర్రీ సినిమా పరిశ్రమను దున్నేయబోతున్నట్లు తెలుస్తోంది.జనవరిలో ఆయన నటించిన త్రిపుల్ ఆర్ విడుదల అవుతోంది.ఫిబ్రవరిలో ఆచార్య మూవీ వస్తుంది.ఆ తర్వాత శంకర్ మూవీ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.2023లో గౌతమ్ సినిమా విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube