Ram Charan Rana: స్కూల్ టైం లో నాకు మార్కులు తక్కువ రావడానికి రానానే కారణం…షాకింగ్ విషయాలు చెప్పిన చరణ్!

మెగా పవర్ స్టార్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే.చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి రామ్ చరణ్ త్రిబుల్ ఆర్( RRR ) సినిమా ద్వారా పాను ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

 Hero Ram Charan Comments Viral On Hero Rana-TeluguStop.com

ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంత మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

ఇకపోతే ఇటీవల రానా ( Rana ) పుట్టినరోజు కావడంతో ఎంతోమంది అభిమానులు గతంలో రానా గురించి రాంచరణ్ మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే ఈ వీడియోలో భాగంగా రాంచరణ్ స్కూల్ టైం లో తనకు మార్కులు తక్కువ రావడానికి కారణం రానానే అంటూ ఈ సందర్భంగా కామెంట్లు చేశారు.

Telugu Ram Charan, Ram Charan Rana, Ramcharan, Rana, Rana Daggubati-Movie

చిన్నప్పుడు రానా రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఒకే స్కూల్లోనే చదువుకునేవారట.అయితే తనకు మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయని తన మామయ్య అల్లు అరవింద్( Allu Aravind ) ఎప్పుడు అడిగే వారిని అప్పుడు తాను నా ముందు బోర్డు కనపడకుండా అంత హైట్ రానా ఉంటే నాకు ఎలా బోర్డు కనపడుతుంది నేనెలా చదవగలను అందుకే మార్కులు తక్కువ వచ్చాయి అంటూ సమాధానం చెప్పేవారట.

Telugu Ram Charan, Ram Charan Rana, Ramcharan, Rana, Rana Daggubati-Movie

రానా అప్పుడు చాలా హైట్ ఉండేవారని తాను మాత్రం చాలా పొట్టిగా ఉండడంతో మా అమ్మ చాలా బలమైనటువంటి ఆహార పదార్థాలను నాకు క్యారేజ్ పంపించేది అయినప్పటికీ తాను పొట్టిగానే ఉన్నాను రానా మాత్రం పెరిగిపోతూ ఉన్నారని రామ్ చరణ్ తెలిపారు.తాను అలా పొట్టిగా ఉండడానికి కారణం రానాకు సురేష్ ప్రొడక్షన్స్( Suresh Productions ) నుంచి ఇంత హైట్ క్యారేజ్ వస్తుందని వాడు ఆ క్యారేజ్ మొత్తం తిని నా క్యారేజ్ లో ఏముందో చూసి

Telugu Ram Charan, Ram Charan Rana, Ramcharan, Rana, Rana Daggubati-Movie

నా క్యారేజ్ కూడా వాడే తినేవాడు అంటూ సరదాగా వారి మధ్య చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి విషయాలను ఈ సందర్భంగా రామ్ చరణ్ తెలియజేశారు.ఇలా రామ్ చరణ్ రానా గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక రానా కూడా బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.

ఇప్పటికీ రానా వరుస సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube