పూరిని నమ్మిన రామ్‌కు ఎలాంటి ఫలితం దక్కేనా?... ఫస్ట్‌లుక్‌తోనే అనుమానాలు మొదలు  

  • డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ల కలయికలో మూవీ అనగానే ఒకప్పుడు అయితే అంచనాలు పీక్స్‌కు వెళ్లేవి. కాని ఇప్పుడు మాత్రం ఇద్దరు కూడా ఫ్లాప్‌ల్లోనే ఉన్నారు, ఈ ఇద్దరు కలిసి ఏం పీకుతారు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. రామ్‌ ఇప్పటికే వచ్చిన ఫ్లాప్‌లు సరిపోనట్లుగా పూరినే ఎందుకు ఎంచుకున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాన్సెప్ట్‌, కంటెంట్‌ ఉన్న దర్శకుడితో రామ్‌ వర్క్‌ చేస్తే ఏమైనా ఫలితం దకొచ్చు, కాని ఇలా మ్యాటర్‌ లేని దర్శకుడితో సినిమా చేయడం ఏంటీ అంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Hero Ram And Puri Jagannath Movie Fixed For Next Movie-Anchor Pradeep Anchor Rashmi Energetic Star Hero Puri Combo Sudheer

    Hero Ram And Puri Jagannath Movie Fixed For Ram Next Movie

  • ఫ్యాన్స్‌ చర్చను, సజీషన్స్‌ను పట్టించుకోకుండా రామ్‌ తన తదుపరి చిత్రాన్ని పూరితో చేసేందుకు ఓకే చెప్పాడు, అందుకు సంబంధించిన టైటిల్‌ కూడా విడుదల అయ్యింది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అంటూ ఈ చిత్రానికి విచిత్రమైన టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. గతంలో కళ్యాణ్‌ రామ్‌తో పూరి చేసిన ఇజం చిత్రానికి కూడా ఇలాంటి చిత్రమైన టైటిల్‌నే ఖరారు చేయడం జరిగింది. ఇప్పుడు అలాంటి టైటిల్‌నే రామ్‌కు పెట్టడం వల్ల మరోసారి పూరి పప్పులో కాలేస్తున్నాడా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

  • ఇక టైటిల్‌తో పాటు, ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసిన పూరి పలు అనుమానాలను రేపుతున్నాడు. అసలు ఇది వర్కౌట్‌ అయ్యేనా అంటూ అనుమానాలు కలుగుతున్నాయి. పూరి మార్క్‌ అంటున్నారు కాని, ఇప్పుడు మార్క్‌ సినిమాలకు ఆధరణ లభించడం లేదని ఇప్పటికే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చెప్పకనే చెప్పాయి.

  • Hero Ram And Puri Jagannath Movie Fixed For Next Movie-Anchor Pradeep Anchor Rashmi Energetic Star Hero Puri Combo Sudheer
  • మళ్లీ అదే తరహా సినిమా, అదే తరహా తప్పు చేస్తే మాత్రం ఈసారి భారీ మూల్యం తప్పదు అంటున్నారు. ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ అయితేనే ప్రేక్షకులు ఆధరిస్తారు. పూరి పిచ్చి ప్రయత్నాలు చేసి, పిచ్చి గంతులు, పిచ్చి చేష్టలు చేయిస్తే మాత్రం సినిమా ఫ్లాప్‌ అవ్వడం ఖాయం అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.