బోయపాటి శ్రీను కూడా రామ్‌ స్థాయిని మించి ఖర్చు చేస్తున్నాడట

రామ్ హీరో గా బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యి చాలా నెలలు అవుతుంది.

 Hero Ram And Boyapati Movie Budget Issue ,  Ram ,  Tollywood , Boyapati Srinu ,-TeluguStop.com

ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.అఖండ వంటి భారీ విజయం తర్వాత బోయపాటి శ్రీను నుండి వస్తున్న సినిమా అవడం తో అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

ఇదే సమయం లో హీరో రామ్ కూడా సక్సెస్ కోసం పరితపిస్తున్నాడు.వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే మాస్ ఆడియన్స్ కి పండగే అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

కానీ ఇప్పటి వరకు సినిమా యొక్క అప్డేట్ ఇవ్వక పోవడం తో చిత్ర యూనిట్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇంతకాలం ఆలస్యం ఏంటి అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఇదే సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా మేకింగ్ విషయంలో దర్శకుడు బోయపాటి శ్రీను ఎక్కడ రాజీ పడడం లేదని ఆయన భారీగా సినిమా కు ఖర్చు చేస్తున్నాడని చెప్తున్నారు.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను మొదట అనుకున్న బడ్జెట్ ని ఎప్పుడో క్రాస్ చేశాడట.

అంత బడ్జెట్ ని రామ్( Ram ) మోయలేస్తాడా, ఆయన స్టామినా అంత ఉందా అనేది కొందరి అనుమానం.మొత్తానికి రామ్ కి సక్సెస్ ఇవ్వాలనే పట్టుదలతో బోయపాటి శ్రీను ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరి ఆయన కోరుకున్నట్లుగా సక్సెస్ ఇవ్వగలడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని వారాలు వెయిట్ చేయాల్సిందే.ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తో( Balakrishna ) బోయపాటి శ్రీను సినిమా ఉండే అవకాశం ఉంది.గతంలో బోయపాటి శీను తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమా ఫలితం పై ఎలాంటి ట్రోల్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే.రామ్ సినిమా ను ఆ ట్రోల్స్ కూడా భయపెడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube