ఎట్టకేలకు రాజశేఖర్‌ కు నెగటివ్‌  

Hero Rajasekhar Tested Negative for Covid, Corona Test, hero rajasekhar, health bulletin ,Rajasekhar Health Condition - Telugu Corona Test, Covid-19, Health Bulletin, Hero Rajasekhar, Hero Rajasekhar Tested Negative For Covid, Jeevitha Rajashekhar, Rajasekhar Health Condition, Rajashekhar, Shivani, Shivatmika

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ఆయన భార్య జీవిత మరియు పిల్లలు ఇద్దరు కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే.కరోనా కారణంగా చాలా మంది సెలబ్రెటీలు ఇబ్బందులు పడుతున్నారు.

TeluguStop.com - Hero Rajashekhar Health Bulletin

ఇప్పుడు రాజశేఖర్‌ వంతు వచ్చింది.ఆయన పిల్లలు ఇద్దరు మరియు జీవిత కూడా కరోనాను ఈజీగానే జయించారు.

కాని రాజశేఖర్‌ ఇతర అనారోగ్య సమస్యలు ఉండటం మరియు వయసు కాస్త ఎక్కువ అవ్వడం వల్ల కరోనా వల్ల రాజశేఖర్‌ ఇబ్బంది పడుతున్నాడు.కొన్ని రోజుల క్రితం రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉంది అంటూ టాక్‌ వచ్చింది.

TeluguStop.com - ఎట్టకేలకు రాజశేఖర్‌ కు నెగటివ్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దాంతో అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఆందోళన చెందారు.ఆసుపత్రి వర్గాల నుండి అధికారికంగా హెల్త్‌ బులిటెన్‌ లు వరుసగా విడుదల అవుతున్నాయి.

మొదట రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
రెండవ హెల్త్‌ బులిటెన్‌ లో రాజశేఖర్‌ ఆరోగ్యం స్థిమితంగా ఉంది.

ఆయన త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నాం.ట్రీట్‌మెంట్‌కు ఆయన స్పందిస్తున్నాడు.

త్వరలోనే ఆయన సాదారణ వార్డ్‌కు మారే అవకాశం ఉందని వైధ్యులు కూడా పేర్కొన్నారు.ఎట్టకేలకు రాజశేఖర్‌ కరోనా ను జయించాడు.

ఆసుపత్రి వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కరోనా టెస్ట్‌ లో తాజాగా నెగటివ్‌ వచ్చిందని తెలుస్తోంది.నెగటివ్‌ వచ్చినప్పటికి ఇతర కేసులను దృష్టిలో పెట్టుకుని మరో వారం లేదా పది రోజుల పాటు ఆయన్ను అత్యంత దగ్గర నుండి పరిశీలించేందుకు వైధ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తానికి రాజశేఖర్‌ అభిమానులకు ఇది గుడ్‌ న్యూస్‌ గా చెప్పుకోవచ్చు.చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు మరియు అభిమానులు రాజశేఖర్‌ ఆరోగ్యం విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యులు ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారట.

#Shivani #HeroRajasekhar #COVID-19 #Rajashekhar #Health Bulletin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Rajashekhar Health Bulletin Related Telugu News,Photos/Pics,Images..