హీరో రాజశేఖర్ ను పెళ్ళి చేసుకోవడానికి అసలు కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన జీవిత!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ హీరో రాజశేఖర్ (Rajasekhar)ఒకరు.ఈయన సినిమాలపై ఉన్న మక్కువతో తన డాక్టర్ వృత్తిని కూడా పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.1984 లో మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఇలా ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతూనే నటి జీవితను(Jeevitha) పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

 Hero Rajashekar Jeevitha Love Story Full Details, Hero Rajashekar, Jeevitha, Shi-TeluguStop.com

అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం.ఇలా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండటమే కాకుండా ఎందరికో ఆదర్శ దంపతులుగా నిలిచారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి జీవిత హీరో రాజశేఖర్ తో తన ప్రేమ ప్రయాణం అసలు తనని పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలను తెలియజేశారు.

Telugu Rajashekar, Rajashekarlove, Jeevitha, Rajasekhar, Talambralu, Tollywood-M

ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ తో కలిసి తలంబ్రాలు(Talambralu) అనే సినిమాలో నటించారు.అయితే ఈ సినిమా సమయంలోనే తమ ప్రేమకు బీజం పడిందని ఈమె తెలిపారు.తలంబ్రాలు సినిమా కోసం ఇద్దరం కలిసి ఎక్కువగా పద్మాలయ స్టూడియో (Padmalaya Studio) లోనే గడిపే వాళ్ళమని తెలిపారు.

అయితే ఆ సమయంలో నేను రాజశేఖర్ ను ఎంతో అర్థం చేసుకున్నాను.ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు.తనలో ఈ విషయం తనకు బాగా నచ్చిందని జీవిత తెలిపారు.పైగా అందంగా ఉంటారు, ఎప్పుడు నవ్వు మొహంతో అందరిని ఆకట్టుకుంటారు.

ఇక ఏ విషయాన్ని కూడా ఆయన దాచకోరు.ఆయన క్యారెక్టర్ తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత సరదాగా ఉండేవారు.

ఇలా రాజశేఖర్ లో ఈ విషయాలు నచ్చి తనతో ప్రేమలో పడ్డానని తెలిపారు.

Telugu Rajashekar, Rajashekarlove, Jeevitha, Rajasekhar, Talambralu, Tollywood-M

ఇలా తన గురించి పూర్తిగా అర్థం చేసుకొని తన ప్రేమలో పడినప్పటికీ నేను ఈ విషయాన్ని బయట పెట్టలేదని అయితే నేను తనని ప్రేమిస్తున్నాననే విషయాన్ని గ్రహించిన రాజశేఖర్ తమ పెళ్ళికి ఇంట్లో వారు ఒప్పుకోరని తెలిపారు.ఇక ఇంట్లో వారిని ఒప్పించి బయటికి రావడం తన వల్ల అయ్యే పని కాదని తెలియజేశారు.మరి కొద్ది రోజులకు తన ఇంట్లో అన్ని సర్దుకున్నాయని తెలిపారంటూ ఈ సందర్భంగా తమ ప్రేమ విషయాన్ని జీవిత బయటపెట్టారు.

ఇక జీవితనే తనకు మొదట ప్రపోజ్ చేసిందని రాజశేఖర్ వెల్లడించారు.తనని పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితమే మారిపోయిందని, ప్రతి ఒక్క విషయంలోనూ తన వెనుకుండి ముందు నడిపించేది అంటూ రాజశేఖర్ జీవిత గురించి గొప్పగా చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube