రాజశేఖర్‌ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్‌  

hero rajasekhar health update, Rajsekhar, health, Rajasekhar Family, Health problems,coronavirus - Telugu Coronavirus, Jeevtha, Rajashekar, Rajashekar Latest Health Update, Sivani, Sivathmika, Social Media

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కుటుంబ సభ్యులు అంతా కూడా కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే.ఆయన కూతుర్లు ఇప్పటికే కరోనాను జయించారు.

TeluguStop.com - Hero Rajashekar Health Update

ఇటీవలే ఆయన భార్య జీవిత కూడా కరోనా నుండి బయట పడ్డారు.కాని రాజశేఖర్ మాత్రం ఇంకా కరోనా నుండి కోలుకోలేదు.

ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది అంటూ ఆయన కూతురు ట్వీట్‌ చేయడంతో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు.నాన్నగారి ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేయండి అంటూ ఆమె చేసిన విజ్ఞప్తి అందరిని కదిలించింది.

TeluguStop.com - రాజశేఖర్‌ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆమె ట్వీట్‌ తో చాలా మంది స్పందించారు.రాజశేఖర్ వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెద్ద ఎత్తున వచ్చాయి.

ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల నుండి మరో ప్రకట వచ్చింది.ఈసారి జీవిత మరియు ఇద్దరు కూతుర్లు మీడియాకు ఒక మెసేజ్‌ను పంపించారు.

అందులో రాజశేఖర్‌ ఆరోగ్యంపై స్పందించారు.
ప్రస్తుతం రాజశేఖర్‌ గారి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.

వైధ్యంకు ఆయన స్పందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.కొందరు పుకార్లు పుట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి.

నాన్న ఆరోగ్యం గురించి మేము ఎప్పటికి అప్పుడు అప్‌డేట్‌ ఇస్తూ ఉంటాం.ఎలాంటి ఆందోళన అక్కర్లేదు.

ఆయన ఆరోగ్యం విషయంలో వైధ్యులు చాలా పాజిటివ్‌గా ఉన్నారు.త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ఆసుపత్రి నుండి బయటకు వస్తారని నమ్ముతున్నాం.

ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం ఉండటం వల్ల కంగారు పడాల్సిన పనేం లేదు అంటూ కుటుంబ సభ్యులు ప్రకటించారు.దాంతో మీడియాలో ఆయన పరిస్థితి విషమం.

ఊపిరి పీల్చుకోలేక పోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది.

#Jeevtha #Social Media #Sivathmika #Sivani #Rajashekar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Rajashekar Health Update Related Telugu News,Photos/Pics,Images..