నన్ను యూజ్ చేసుకోండి.. ఓపెన్‌గా చెబుతున్న హీరో..

Hero Rajasekhar Open Offer Tollywood

సినిమాలో ఓ వ్యక్తి పూర్తి కాలంపాటు హీరోగా కొనసాగలేరు.కాలం కలిసిరాకనో.లేక అవకాశాలు లేకనో.లేదా వయస్సు మీదపడటం వల్లనో ఇది జరుగుతుంది.ఇక వారు ఆ పాత్రలకు బదులు ప్రత్యామ్నాయ పాత్రలపై ఆధారపడక తప్పదు.ఒకప్పుడు హీరోగా కొనసాగిన వారంతా ప్రస్తుతం తమ అవకాశలకు అనుగుణంగా విలన్ పాత్రలు సైతం పోషించి క్యాష్ చేసుకుంటున్నారు.

 Hero Rajasekhar Open Offer Tollywood-TeluguStop.com

ఇలాంటి కేటగిరిలో టాలీవుడ్‌లో మొదటి స్థానంలో ఉన్న జగపతిబాబు. హీరోగా అవకాశలు వచ్చినంత వరకు హీరోగా నటించిన ఆయన.ఆ అవకాశాలు తగ్గిపోగానే విలన్ పాత్రలతో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.కారణం ఏదైనా కానీ సినీ మార్కెట్‌లో తన క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్నారు.

ఇలాంటి విషయానికి మరొకరిని ఉదహారణగా తీసుకుంటే.సునీల్. ఈయన మొదట కమెడియన్‌గా చాలా సినిమాల్లో నటించారు.అప్పట్లో ఆయనకు కుప్పలు తెప్పులుగా ఆఫర్లు వచ్చేవి.

 Hero Rajasekhar Open Offer Tollywood-నన్ను యూజ్ చేసుకోండి.. ఓపెన్‌గా చెబుతున్న హీరో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందాల రాముడు మూవీతో హీరో అవతారమెత్తాడు.అప్పటి నుంచి వరుసగా కొన్ని సినిమాలు తీసినా అవి బాక్సాఫిస్ వద్ద చతికిల పడ్డాయి.

ఇక మల్టీస్టారర్ మూవీగా వచ్చిన తడాఖా సినిమాలో నాగచైతన్య హీరోగా నటించగా సునీల్ హీరో అన్నయ్య పాత్రలో నటించారు.అలాంటి పాత్రలు సైతం అక్కడికే పరిమితమవడంతో రీసెంట్ కలర్ ఫొటో సినిమాతో విలన్‌ అవతారమెత్తాడు.

ఇలా హీరోగా అవకాశాలు దొరకనప్పుడు ప్రత్యామ్నాయ పాత్రల్లో నటించేందుకు కొందరు ముందుకు వస్తున్నా.మరి కొందరు అక్కడే ఆగిపోతున్నారు.

Telugu Akhanda, Balakrishna, Rajasekhar, Heroesvillain, Jagapathi Babu, Sunil-Movie

ఎప్పటి నుంచో హీరోగా కొనసాగుతున్న మరో నటుడు రాజశేఖర్. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు ఆయన పెట్టింది పేరు.కానీ ప్రస్తుతం ఆయన చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు.దీంతో రెగ్యులర్ రోల్స్‌కు ఆయన ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు.మంచి పాత్రలు వస్తే విలన్‌గా నటించేందుకు తాను సిద్ధమని అందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.పరిస్థితులను, కథను సరిగ్గా డిజైన్ చేసుకుంటే రాజశేఖర్‌ను పవర్ ఫుల్ విలన్‌గా చూపించొచ్చు.

Telugu Akhanda, Balakrishna, Rajasekhar, Heroesvillain, Jagapathi Babu, Sunil-Movie

కానీ ఆయనను ఏ డైరెక్టరూ చాన్స్ ఇవ్వడం లేదు.వాస్తవానికి బాలకృష్ణ నటిస్తున్న అఖండ మూవీలో రాజశేఖర్‌ను విలన్‌గా పరిచయం చేద్దామనుకున్నారు డైరెక్టర్ బోయపాటి.కానీ ఎందుకో వెనక్కి తగ్గారు.ఇందుకు కారణంగా రాజశేఖర్ రెమ్యునరేషన్ విషయమేనని టాక్.

#Rajasekhar #HeroesVillain #Akhanda #Balakrishna #Jagapathi Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube