చిరంజీవి హీరోగా నటించి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలలో స్నేహం కోసం సినిమా కూడా ఒకటి.కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 1999 సంవత్సరం జనవరి 1వ తేదీన విడుదలైంది.
ఈ సినిమాలో విజయ్ కుమార్ కీలక పాత్రలో నటించారు.అయితే విజయ్ కుమార్ నటించిన పాత్రకు మొదట మేకర్స్ హీరో కృష్ణ, రాజశేఖర్ పేర్లను పరిశీలించారు.
కానీ చివరకు ఆ పాత్రకు విజయ్ కుమార్ ఎంపికయ్యారు.
చిరంజీవి కృష్ణ కాంబినేషన్ లో కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీ, తోడు దొంగలు సినిమాలు వచ్చాయి.
ఈ మూడు సినిమాల తర్వాత చిరంజీవి కృష్ణ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.అయితే స్నేహం కోసం సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందు వీళ్లిద్దరూ ఈ సినిమాలో కలిసి నటిస్తారని వార్తలు వచ్చాయి.
నట్పుక్కాగ పేరుతో కే ఎస్ రవికుమార్ తమిళంలో తెరకెక్కించిన సినిమా చిరంజీవి బాగా నచ్చింది.
కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లోనే నటుక్కాగ రీమేక్ స్నేహంకోసంలో నటించడానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే మేకర్స్ కృష్ణ పేరును పరిశీలించినా ఆ పాత్ర కోసం ఆయనను సంప్రదించలేదు.ఆ తరువాత మేకర్స్ రాజశేఖర్ పేరును పరిశీలించారు.
రాజశేఖర్ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కానీ చిరంజీవి రాజశేఖర్ ను ఓల్డ్ రోల్స్ చేయవద్దని సూచనలు చేశారు.
చిరంజీవి అలా చెప్పడంతో ఆ పాత్రలో నటించడానికి రాజశేఖర్ నో చెప్పారు.ఆ తర్వాత తమిళంలో ఆ పాత్రను పోషించిన విజయ్ కుమార్ నే తెలుగులో ఎంపిక చేశారు.తమిళంలో సిమ్రాన్ నటించిన పాత్రలో తెలుగులో మీనా నటించారు.చిరంజీవి రాజశేఖర్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.