రాజశేఖర్‌ 'కల్కి' సెన్సార్‌ టాక్‌ ఏంటో తెలుసా?  

Hero Rajasekhar Kalki Movie Censor Talk-

యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ చిత్రం ఈవారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ అంచనాలున్న ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.చివరగా నిన్న సెన్సార్‌ కార్యక్రమాలు కూడా ఈ చిత్రం పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Hero Rajasekhar Kalki Movie Censor Talk--Hero Rajasekhar Kalki Movie Censor Talk-

సెన్సార్‌ సభ్యుల నుండి ఈ సినిమాకు ఎలాంటి టాక్‌ వచ్చిందనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతుంది.టీజర్‌ మరియు ట్రైలర్‌తో రాజశేఖర్‌ మరో సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Hero Rajasekhar Kalki Movie Censor Talk--Hero Rajasekhar Kalki Movie Censor Talk-

‘కల్కి’పై ఉన్న అంచనాలు పెంచేలా సెన్సార్‌ బోర్డు సభ్యులు వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.రాజశేఖర్‌ను పది సంవత్సరాల క్రితం చూసినట్లుగా ఉంది అంటూ సెన్సార్‌ బోర్డు సభ్యులు అన్నట్లుగా తెలుస్తోంది.1980 నేపథ్యంలోని సన్నివేశాలు చాలా సహజంగా ఉన్నాయని, అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చూపించాడంటూ అభినందించారు.అద్బుతమైన యాక్షన్‌ సన్నివేశాలు కూడా సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయట.ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్‌ను జారీ చేయడం జరిగింది.

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు మరియు ఓవర్సీస్‌లో కూడా భారీగానే విడుదల చేయాలని నిర్ణయించారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.రాజశేఖర్‌ గత చిత్రం గరుడవేగ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో జనాల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.