ఆ పాత్రలకు నో చెప్పి రాజశేఖర్ తప్పు చేశారా.. పరిస్థితి దారుణమంటూ?

సినిమా రంగంలో కాలంతో పాటు మారితే మాత్రమే కొత్త సినిమా ఆఫర్లు రావడంతో పాటు కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు.హీరో రాజశేఖర్ కు ఈ మధ్య కాలంలో తను హీరోగా తెరకెక్కుతున్న సినిమాలతో వరుస షాకులు తగులుతున్నాయనే సంగతి తెలిసిందే.

 Hero Rajasekhar Decisions Effect On His Career Details, Rajasekhar Decisions, Hero Raja Sekhar, Sekhar Movie, Sekhar Movie Flop, Jeevita Rajasekhar, Rajasekhar Story Selection, Jagapati Babu , Srikanth-TeluguStop.com

శేఖర్ సినిమాతో రాజశేఖర్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది.ఈ సినిమా పుంజుకునే అవకాశం అయితే దాదాపుగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జగపతిబాబు, శ్రీకాంత్ మార్కెట్ తగ్గిన తర్వాత కొత్త తరహా పాత్రలకు ఓకే చెబుతూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.కొన్నిరోజుల క్రితం గోపీచంద్ శ్రీవాస్ కాంబో మూవీలో కీలక పాత్ర కోసం రాజశేఖర్ ఎంపికయ్యారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

 Hero Rajasekhar Decisions Effect On His Career Details, Rajasekhar Decisions, Hero Raja Sekhar, Sekhar Movie, Sekhar Movie Flop, Jeevita Rajasekhar, Rajasekhar Story Selection, Jagapati Babu , Srikanth-ఆ పాత్రలకు నో చెప్పి రాజశేఖర్ తప్పు చేశారా.. పరిస్థితి దారుణమంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తర్వాత రోజుల్లో రాజశేఖర్ ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.మంచి పాత్రలు రావడం లేదని తన ఇమేజ్ ను వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అందుకే తాను తప్పుకున్నానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

కరోనా థర్డ్ వేవ్ తర్వాత హిట్ టాక్ వచ్చిన సినిమాలను మాత్రమే థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

Telugu Effect Career, Raja Sekhar, Jagapati Babu, Rajasekhar, Sekhar, Sekhar Flop, Srikanth-Movie

ప్రస్తుతం రాజశేఖర్ కు పెద్దగా క్రేజ్ లేదు.మరీ హిట్ టాక్ వచ్చినా రాజశేఖర్ సినిమాలకు కలెక్షన్లు వస్తాయా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తుంది.రాజశేఖర్ ఇకనైనా కథల ఎంపికలో పాత్రల ఎంపికలో మారాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Telugu Effect Career, Raja Sekhar, Jagapati Babu, Rajasekhar, Sekhar, Sekhar Flop, Srikanth-Movie

ఇకనైనా రాజశేఖర్ మారని పక్షంలో ఆయన కెరీర్ ప్రమాదంలో పడినట్టేనని చెప్పవచ్చు.మరోవైపు వరుస వివాదాలు రాజశేఖర్ కుటుంబానికి ఊహించని స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నాయి.రాజశేఖర్ కుటుంబం ఇకనైనా వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.వివాదాల వల్ల రాజశేఖర్ సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కెరీర్ విషయంలో రాజశేఖర్ జాగ్రత్త పడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube