టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్ గురించి అందరికీ తెలిసిందే.ఈయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.
అంతేకాకుండా తన భార్య జీవిత కూడా తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు అందుకుంది.వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.
అందులో ఒకరు శివాత్మిక ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయగా దొరసాని సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఈ సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు అందుకున్న శివాత్మిక.
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ అనే సినిమాలో నటిస్తుంది.ఇక రాజశేఖర్ తన మరో కూతురు శివాని ని కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడు రాజశేఖర్.
హీరోయిన్ గా నటించడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉంది శివాని.అంతేకాకుండా తాను నటించే సినిమాలో తమిళ స్టార్ హీరో నటించనున్నాడట.
ప్రస్తుతం ఈ విషయం గురించి టాలీవుడ్, కోలీవుడ్ లో బాగా ప్రచారాలు వినిపిస్తున్నాయట.గతంలోనే శివాని ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నాడు రాజశేఖర్.
కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేకపోయింది.ఇక ప్రస్తుతం తమిళ సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సరసన శివాని హీరోయిన్ గా నటించనుందట.ఇక ఈ సినిమా రెండు భాషల్లో తెరకెక్కనుందట.ఈ సినిమాతో వీళ్లు మంచి సక్సెస్ ను అందుకోవాలని అనుకుంటున్నారని తెలిసింది.
ఇక ఈ సినిమా కథ కోసం శివాని బాగా కుదురుతుందని నిర్మాతలు తెలుపుతున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమా గత ఏడాదే మొదలు కావాల్సి ఉండగా.
ఆ సమయంలో తమిళనాడులో ఎన్నికల వేళ, కరోనా ఫస్ట్ వేవ్ ఉండడం వల్ల వాయిదా పడిందట.మొత్తానికి రాజశేఖర్ తన రెండో కూతురు ను కూడా ఇండస్ట్రీలో పరిచయం చేయనున్నారు.