కన్నడ రీమేక్ పై కన్నేసిన రాజశేఖర్

యాంగ్రీ యాంగ్ మెన్ గా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన హీరో రాజశేఖర్.రాజశేఖర్ అంటే అందరికి ఇప్పటికి అంతే యంగ్ లుక్ లో ఉన్న రూపం కనిపిస్తుంది.

 Hero Rajasekhar Concentrate On Kannada Movie Remake-TeluguStop.com

కెరియర్ లో ఎత్తు పల్లాలు సంగతి పక్కన పెడితే రాజశేఖర్ టాలీవుడ్ లో చిరస్థాయిగా గుర్తుండిపోయే సినిమాలలో నటించాడు అని చెప్పాలి.ఇక చాలా కాలంగా హిట్స్ కి దూరమైనా రాజశేఖర్ మరల గరుడ వేగ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు.

తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కీ అనే సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందికి వచ్చాడు.ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ పెద్దగా రాలేదు.

ఇదిలా ఉంటే రాజశేఖర్ ఇప్పుడు ఓ కన్నడ సినిమా మీద ద్రుష్టి పెట్టాడని, దానిని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా రీమేక్ రైట్స్ ని తమిళ నిర్మాత ధనుంజయ ఇప్పటికే కొనడం జరిగిందని తెలుస్తుంది.

ఈ సినిమాని రాజశేఖర్ తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కించి తన మార్కెట్ ని కూడా పెంచుకోవాలని ఆలోచనలో ఉన్నాడని సమాచారం.దీని కోసం ఈ సినిమాలో మరో హీరోగా సత్యరాజ్ కొడుకు శిబిరాజ్ ని ఎంపిక చేసారని తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube