ఈ టాలీవుడ్ హీరో రూ.100 కోసం ఇబ్బంది పడ్డాడంట..?

రెండు దశాబ్దాల క్రితం హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి ఆనంద్ సినిమా ద్వారా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజా.కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన రాజా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించారు.

 Hero Raja Shares His Struggles In Film Industry,hero Raja , Anand Movie, Paster,-TeluguStop.com

క్రిస్టియన్ యువతిని పెళ్లి చేసుకుని పాస్టర్ గా మారి సినిమాలకు దూరమైన రాజా తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరై ఆ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

వైజాగ్ లో పుట్టిన రాజా సినిమాల్లోకి రాకముందు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న రాజా బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం, నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ కావడంతో సినిమా అవకాశాలు తగ్గాయి.ఇంటర్వ్యూలో రాజా మాట్లాడుతూ సినిమాలపై ఆసక్తిని కోల్పోయానని అందువల్లే తాను పాస్టర్ ను కావాల్సి వచ్చిందని తెలిపారు.

సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్ లోని గ్రీన్ పార్క్ హోటల్లో రిసెప్షనిష్ట్ గా పని చేశానని అన్నారు.

రాజా తల్లి క్రిష్టియన్ కాగా తండ్రి హిందూ మతానికి చెందిన వారు.

ఇంటర్వ్యూలో తల్లీదండ్రులతో కలిసి చర్చికి వెళ్లేవారా.? అనే ప్రశ్న ఎదురు కాగా రాజా ఐదు సంవత్సరాల వయస్సులో అమ్మ చనిపోయిందని.అమ్మ తనకు గుర్తు లేదని.14 సంవత్సరాల వయస్సులో నాన్న చనిపోయాడని అన్నారు.తనకు ఇద్దరు అక్కలు ఉన్నారని దేవుడు అమ్మను తీసుకుపోయినా ఇద్దరు అక్కలే తనకు అమ్మలుగా మారారంటూ రాజా భావోద్వేగానికి గురయ్యారు.

ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలా.? వద్దా.? అని తనను అడిగితే తాను వద్దని చెబుతానని తెలిపారు.100 రూపాయల కోసం తాను అవమానాలు పడిన రోజులు, ఇబ్బందులు పడిన రోజులు కెరీర్ లో ఉన్నాయని వెల్లడించారు.సినిమాల్లో ఛాన్సుల కోసం తిరుగుతున్న సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ తనను తీవ్రంగా నిరాశపరిచారని చెప్పారు.

అందగాడిని అనుకుంటున్నావా.? మొహం అద్దంలో చూసుకున్నావా.? అని అన్నారని కానీ ఆయన మనస్సు మంచిదని తెలిపారు.

ఆనంద్ సినిమా స్క్రిప్ట్ చదివి శేఖర్ కమ్ములకు ఫోన్ చేసి జాక్ పాట్ కొడతావని ఆయనతో చెప్పానని చెప్పినట్టుగానే జరిగిందని రాజా అన్నారు.గోదావరి సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చినా చేయలేదని ఒక పెద్దాయన ఆ సినిమా చేయనందుకు తనను తిట్టాడని తెలిపారు.తను చేసిన సినిమాల్లో కొన్ని సినిమాల్లో ఎందుకు చేశానా.? అని ఫీల్ అవుతుంటానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube