ఆ ప్రముఖ హీరో ఎం.ఎల్.ఏ కూతుర్ని ప్రేమించాడు..ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది..! చివరికి ఎలా మోసపోయాడంటే.?       2018-06-27   01:30:32  IST  Raghu V

డబ్బు ,సక్సెస్ ఉంటేనే బంధువులైనా,స్నేహితులైనా మనతో ఉంటారు.ఒకసారిగా అవన్నీ కోల్పోయి జీరోగా మిగిలితే అయినవారే ఈసడించుకుంటారు.బంధాల్ని,ప్రేమని శాసించేంత పవరు డబ్బుకి ఉంది.ఫెయిల్యూర్ స్టోరీ సినిమా వాళ్ల లైఫ్ లో చాలా ఉంటాయి.సినిమా హిట్టు అయితేనే వాళ్లు హీరోలు..ఒక్క సినిమా ఫట్టయినా అంతే జీరోలకన్నా దిగువకు జారిపోతారు..

ఆనంద్ సినిమాలో రాజా నటనకు ఫిదా అవ్వని సినీ ప్రేక్షకుడు లేడు.ఆనంద్ కి ముందు ఆ తర్వాత కూడా కొన్ని మంచి సినిమాల్లో నటించారు రాజా.కానీ ఆ తర్వాత అన్ని ప్లాపులే..సినిమా కెరీర్ కి పూర్తిగా చెక్ పెట్టేసి..పూర్తిగా క్రిస్టియానిటిని నమ్ముతూ,మరోవైపు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్నాడు..రాజా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసారట అనే వార్త ఒకటి ఈ మధ్య తెగ చక్కర్లు కొడుతుంది.ఆ అమ్మాయి మరెవరో కాదు ఒక ఎమ్మెల్యే కూతురని అనుకుంటున్నారు.రాజకీయాలకు,రాజా కీ ఏంటి సంభందం అనుకుంటున్నారా మంచి ప్రశ్న..

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తో రాజా కు మంచి సంభందాలుండేవి.ఆ సంభందాలే రాజా కెరీర్ కు హెల్ప్ చేశాయని అప్పట్లో ప్రచారం జరిగింది.సడన్ గా వైఎస్ ఆర్ చనిపోవడం,సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో రాజా ఒక్కసారిగా కెరీర్లో అధ: పాతాలానికి పడిపోయారు.దీంతో ప్రేమ కూడా బెడిసి కొట్టింది.

ఎమ్మెల్యే కూతురుతో ప్రేమకు,పెళ్లికి ఆ కుటుంబం అంగీకరించినప్పటికి ,అస్తవ్యస్తంగా ఉన్న రాజా కెరీర్ చూసి చివరికి క్యాన్సల్ చేసుకున్నారట ఆ ఎమ్మెల్యే.తర్వాత ఆ అమ్మాయిని వేరే వారికి ఇచ్చి పెళ్లిచేశారు.రాజా మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు..అతి చిన్న వయసులో అమ్మానాన్న ని పోగొట్టుకుని,డిప్రెషన్ తో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన రాజాకు జీవితం విలువ తెలుసుకాబట్టే ప్రేమ విఫలం అయినా బాదపడకుండా జీవితాన్ని గడుపుతున్నాడు.