ఫోన్ నెంబర్ లీక్ చేసిన యువ హీరో..!

సినీ ఇండస్ట్రీలో నటీనటుల గురించి తెలుసుకోవడానికి అభిమానులకు చాలా ఆసక్తి ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో వారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటారు.

 Hero Raj Tharun Leaked Phone Number While Interaction With Netizens , Raj Tarun,-TeluguStop.com

అంతేకాకుండా తమ అభిమాన నటీనటులతో తెగ ముచ్చటిస్తుంటారు.వారి ఇష్టాయిష్టాలు గురించి కామెంట్ రూపంలో ప్రశ్నిస్తుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ యువ హీరో తో తన అభిమానులు ఫోన్ నెంబర్ అడిగిన వెంటనే ఫోన్ నెంబర్ ను లీక్ చేసాడు.

ఇంతకీ అతనెవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.

ఈయన ఉయ్యాల జంపాల సినిమా తో సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు.ఇక ఆ తర్వాత వరుస సినిమాలు.

సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లో నటించగా మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించగా అవి అనుకున్నంత గుర్తింపు రాలేదు.

ఇక ప్రస్తుతం స్టాండ్ అప్ రాహుల్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

Telugu Avika Gor, Bollywood, Netizens, Kumari, Chiranjeevi, Number Leak, Raj Tar

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చటించాడు.ఇక వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.ఇక తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి అని, అతని క్రష్ సమంత అని సమాధానం ఇచ్చాడు.ఒక నెటిజన్ మాత్రం తన ఫోన్ నెంబర్ అడిగా వెంటనే 9848022338 అనే నెంబర్ ను లీక్ చేశాడు.

ఇక ఈ నెంబర్ కు నెటిజనులు డయల్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మమ్మల్ని మోసం చేశావంటూ నిందించారు.ఇక అప్పుడు ఇది నా నెంబర్ కాదని శివమణి ఫోన్ నెంబర్ అని తెలుపగా అందరూ ఫన్నీ కామెంట్స్ చేశారు.

ఇక ఆయన త్వరలోనే అవికా గోర్ తో ఓ సినిమా చేయనున్నానని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube