ఆ మాట వినగానే భయమేసిందంటున్న ప్రదీప్..?  

hero pradeep speech in 30 rojulloo preminchadam ela movie pre release event, fear , word, pradeep, anchor, hero, trailer, neeli neeli akasham song, trailer, success, stage, parents pradeep machiraju, heroine amrutha ayyar, director, munna - Telugu 30 Rojullo Preimincham Ela, Amruta Aier, Amrutha Ayyar, Anchor, Director, Fear, Hero, Hero Pradeep, Jan 29th, Munna, Neeli Neeli Akasham Song, Parents Pradeep Machiraju, Pradeep, Stage, Success, Trailer, Word

బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ప్రదీప్ కు జోడీగా అమృతా అయ్యర్ ఈ సినిమాలో నటిస్తుండగా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

TeluguStop.com - Hero Pradeep Speech In 30 Rojulloo Preminchadam Ela Movie Pre Release Event

మున్నా ఈ సినిమకు దర్శకత్వం వహించగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రదీప్ యాంకర్ ప్రదీప్ నుంచి హీరో ప్రదీప్ గా మారడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను వ్యాఖ్యాతగా ఎన్నో సినిమాలకు స్టేజ్ పైన నిలబడి హీరోహీరోయిన్లను ఆహ్వానించానని.

TeluguStop.com - ఆ మాట వినగానే భయమేసిందంటున్న ప్రదీప్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తొలిసారి తనను హీరో ప్రదీప్ అని పిలిచి స్టేజ్ పైకి ఆహ్వానించడంతో భయం వేసిందని ప్రదీప్ అన్నారు.అభిమానులు చూపించిన ప్రేమాభిమానం వల్లే తన ప్రయాణం ఎంతో సులువైందని.

తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు పాదాభివందం చేస్తున్నానని అన్నారు.సినిమా దర్శకుడు మున్నా తనలో ఎంతో ధైర్యం నింపాడని ప్రదీప్ తెలిపారు.

మున్నా అసలు పేరు ప్రదీపే అని తామిద్దరం కలిసి మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని ప్రదీప్ అన్నారు.తమ బంధం 30 సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు.నిజ జీవితంలో తనకు అన్నయ్యలు లేరని దర్శకుడు మున్నా రూపంలో మంచి అన్నయ్య దొరికాడని తెలిపారు.తాను మిడిల్ క్లాస్ అబ్బాయిగా థియేటర్ల ముందు పోస్టర్లు చూసేవాడినని ఇప్పుడు తన సినిమానే థియేటర్ లో చూసే స్థాయికి ఇద్దరు దేవుళ్లు తీసుకొచ్చారని ప్రదీప్ అన్నారు.

ఆ ఇద్దరు దేవుళ్లు ఎవరో కాదని తన తల్లిదండ్రులేనని తెలిపారు.ఈ నెల 29వ తేదీన థియేటర్లలో కలుద్దామని అన్నారు.

ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించాడం ఎలా సినిమా ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే.

#Hero Pradeep #Hero #ParentsPradeep #Director #Success

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు