హీరో ప్రభుదేవా సినిమా షూటింగ్ ప్రారంభం.. ఈసారి?

సినిమా ఇండస్ట్రీలోకి కొరియోగ్రాఫర్ గా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన ప్రభుదేవా ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా నటుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు.

 Hero Prabhudeva Movie Shooting Under The Direction Of Shyam Rotrics Started, Pra-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న ప్రభుదేవా మొట్టమొదటిసారిగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ క్రమంలోనే ఆ తర్వాత పౌర్ణమి,శంకర్ దాదా జిందాబాద్, పోకిరి సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్‌ చేసి అద్భుతమైన విజయాలను అందుకున్నారు.అయితే ఈ మధ్యకాలంలో ప్రభుదేవా దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రభుదేవా దర్శకత్వం వహించిన సినిమాలు పెద్దగా విజయాలను అందుకోకపోవడంతో ప్రభుదేవా పూర్తిగా దర్శకత్వం బాధ్యతలను తొలగించుకొని నటుడిగా కొనసాగాలని భావించారు.

Telugu Bollywood, Choreographer, Shyam, Joy Box, Start, Prabhu Deva, Prabhudeva,

తాజాగా ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది.శ్యామ్‌ రోట్రిక్స్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ జాయ్‌ ఫిలిం బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జాన్‌ బ్రట్టో నిర్మిస్తున్నాడు. ఈసారి ప్రభుదేవాను ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ హీరోగా చూపించబోతున్నట్లు సమాచారం.

త్వరలోనే ఈ సినిమా టైటిల్.ఇతరతా విషయాల గురించి త్వరలోనే చిత్రబృందం వెల్లడించనున్నట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube