పూరీ జగన్నాథ్ భార్య ప్రవర్తన అలా ఉంటుందట.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్!

Hero Prabhas Shocking Comments About Puri Jagannaath

ప్రభాస్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు తెరకెక్కాయి.ఈ సినిమాలలో బుజ్జిగాడు అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకోగా ఏక్ నిరంజన్ సినిమా ఫ్లాప్ అయింది.

 Hero Prabhas Shocking Comments About Puri Jagannaath-TeluguStop.com

అయితే పూరీ జగన్నాథ్ ప్రేక్షకులకు సుపరిచితమైనా ఆయన భార్య లావణ్య గురించి మాత్రం ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ పూరీ జగన్నాథ్ భార్య లావణ్య గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అందరినీ డార్లింగ్ అని పిలిచే ప్రభాస్ రొమాంటిక్ సినిమాపై అంచనాలను పెంచడం కోసం ఆకాష్ పూరీని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి గల కారణాన్ని సైతం ప్రభాస్ వెల్లడించారు.

 Hero Prabhas Shocking Comments About Puri Jagannaath-పూరీ జగన్నాథ్ భార్య ప్రవర్తన అలా ఉంటుందట.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభాస్ బుజ్జిగాడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.పూరీ జగన్నాథ్ భార్య లావణ్య మంచితనం గురించి ప్రభాస్ చెప్పుకొచ్చారు.

బుజ్జిగాడు సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్, పూరీ జగన్నాథ్ భోజనం చేస్తుండగా మరో మహిళ కూడా అక్కడ భోజనం చేస్తున్నారని తాను ఆమె ఎవరని కనుక్కోగా పూరీ జగన్నాథ్ ఇంట్లో పని చేసే పనిమనిషి అనే సమాధానం వినిపించిందని ప్రభాస్ తెలిపారు.

Telugu Akash Puri, Bujjigadu, Puri Jagannath, Purijagannath, Romantic, Tollywood-Movie

తమతో పాటు పనిమనిషిని కూడా భోజనానికి కూర్చోబెట్టుకునే మంచి గుణం లావణ్యదని ప్రభాస్ వెల్లడించారు.

Telugu Akash Puri, Bujjigadu, Puri Jagannath, Purijagannath, Romantic, Tollywood-Movie

ఈ రీజన్ వల్లే తాను రొమాంటిక్ సినిమాకు ఈ విధంగా సహాయం చేశానని ప్రభాస్ పేర్కొన్నారు.అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని ఆకాష్ పూరీకి ప్రభాస్ సలహా ఇవ్వడం గమనార్హం.వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు రిలీజవుతున్నాయి.ప్రభాస్ సినిమాలలో ఒక్కటి సక్సెస్ సాధించినా ప్రభాస్ జాతకమే మారిపోయే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.ప్రభాస్ ప్రతిభ ఉన్న, పాన్ ఇండియా టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు ఛాన్సులు ఎక్కువగా ఇస్తున్నారు.

#PuriJagannath #Bujjigadu #Romantic #Akash Puri #Puri Jagannath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube