ప్రభాస్ సలార్ లోకేషన్ ఫోటోలు లీక్.. చివరికి అలా?

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుని వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు.ఇప్పటికే రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

 Hero Prabhas Salaar Movie On Location Photos Leaked,  Salaar Movie ,prabhas,  Sa-TeluguStop.com

ఇదిలా ఉండగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న “సలార్”సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా లొకేషన్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అవడంతో సినిమా నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు.ఈ ఫోటోలో ప్రభాస్ లుక్ చూస్తుంటే ఒక మెకానిక్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తెలంగాణ గోదావరి ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

పాన్ ఇండియా రూపంగా తెరకెక్కిస్తున్న సలార్ ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.ఇందులో ప్రభాస్ సరసన క్రాక్ హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తున్నారు.

Telugu Salaar, Prabhassalaar, Leaked, Prabhas, Salaar Scene-Movie

సలార్ ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రశాంత్ నీల్ కి 4 నెలల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది.తొందరగానే షూటింగ్ పూర్తి చేసుకొని ఈ వేసవిలో విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలియజేశారు.ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.ఇదిలా ఉండగా సలార్ సినిమా తర్వాత ప్రభాస్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ చిత్ర నిర్మాణంలో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తున్నట్లు ఇదివరకే చిత్రబృందం తెలియజేశారు.ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube