పవన్ అజ్ఞానవాసి.. కాల్షీట్ కు న్యాయం చేశాడు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.తిరుపతిలో పాల్గొన్న బీజేపీ, జనసేన ప్రచార సభపై నాని స్పందించారు.

 Pawan Kalyan Is A Agnanavasi And Fulfilled His Call Sheet Says Perni Nani , Pern-TeluguStop.com

టీడీపీ, బీజేపీ ప్రాయోజిత కార్యక్రమాన్ని పవన్ బాగా రక్తి కట్టించాడని.తన కాల్షీట్ కు పూర్తి న్యాయం చేశాడని అన్నారు.

పవన్ కళ్యాణ్ ఓ అద్దె మైకులా తయారయ్యాడని విమర్శించారు పేర్ని నాని.పవన్ నాయుడు అంటూ పవన్ ను ఉద్దేశించి మాట్లాడారు నాని.నాడు దక్షిణాదికి బీజేపీ అన్యాయం చేస్తుందని విమర్శించిన పవన్ నేడు అదే బీజేపీకి మద్దతు ఇవ్వాలని అంటున్నాడని అన్నారు.

2014లో కాంగ్రెస్ ను పారదోలాలని అన్నారు.2019లో బీజేపీకి దక్షిదాణి రాష్ట్రాలంటే చిన్న చూపని అన్నాడు.పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని చెప్పాడు.

ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నావని ఫైర్ అయ్యారు పేర్ని నాని.వివేకా హత్య కేసు విచారణ ఏ దశలో ఉందో పవన్ కు తెలుసా అని ప్రశించారు.

సీబీఐ నేరుగా కేంద్ర హోం మంత్రి ఆధీనంలో పనిచేస్తున్న విషయం తెలియదా అని ఎద్దేవా చేశారు.పవన్ అజ్ఞాతవాసి అనుకున్నాం కాని అజ్ఞానవాసి అని ఇప్పుడు అనిపిస్తుందని తీవ్రంగా మండిపడ్డారు పేర్ని నాని.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube