దిల్‌రాజుకు ఇక్కడ దిక్కు మొక్కు లేకుండా పోయింది... కన్నడంలో మాత్రం అప్పుడే మొదలు

తమిళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ‘96’ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే.విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న 96 చిత్రం తెలుగులో రీమేక్‌ చేస్తే ఫీల్‌ రాదని, తెలుగు ఆడియన్స్‌ అలాంటి స్లో స్క్రీన్‌ప్లేను చూడరు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Hero Not Finding For 96 Movie To Dil Raju In Tollywood-TeluguStop.com

అయినా కూడా దిల్‌రాజు మాత్రం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.పలువురికి ఆ సినిమాను చూపిస్తున్నాడు.

మొదట అల్లు అర్జున్‌ ఈ చిత్రానికి ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి.ఆ తర్వాత నానికి ఈ చిత్రంను చూపించిన దిల్‌రాజు ఓకే చెప్పించుకున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.ఇప్పుడు గోపీచంద్‌ తో ఈ చిత్రాన్ని చేసేందుకు నిర్మాత దిల్‌రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.గోపీచంద్‌ వార్తలు అయినా నిజమో కాదో తెలియాల్సి ఉంది.

ఇక గోపీచంద్‌ హీరోగా ప్రస్తుతం ఇతర సినిమాలు తెరకెక్కుతున్నాయి, కనుక ఈ చిత్రం ఆలస్యం అవ్వొచ్చు అంటున్నారు.

దిల్‌రాజు ఒక వైపు 96 గురించి చర్చలు జరుపుతున్న సమయంలోనే కన్నడంలో రీమేక్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు.కన్నడ గోల్డెన్‌ స్టార్‌ గణేష్‌ హీరోగా రీమేక్‌ తెరకెక్కబోతుంది.తమిళంలో విజయ్‌ సేతుపతి చేసిన పాత్రను గణేష్‌ చేయడం ఖాయం అయ్యింది.

హీరోయిన్‌గా త్రిష నటించిన విషయం తెల్సిందే.ఆ పాత్రను ఎవరు చేస్తారనే విషయమై క్లారిటీ రాలేదు.

తెలుగులో చర్చలు జరుగుతూనే ఉంటాయి, కన్నడంలో సినిమా మొదలై విడుదల కూడా అయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.వచ్చే ఏడాదిలో అయినా దిల్‌రాజు 96ను పట్టాలెక్కిస్తాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube