నితిన్ దారి తీశాడు.. ఇక అందరు ఆ దారిలో వెళ్లాల్సిందే!

కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా రెండు నెలలుగా షూటింగ్‌ లు పూర్తిగా నిలిచి పోయాయి.ఇటీవలే ముంబయిలో థియేటర్లకు అనుమతించడంతో పాటు షూటింగ్ లకు కూడా ఓకే చెప్పారు.

 Hero Nitin Movie Maestro Shooting Re Start-TeluguStop.com

దాంతో మళ్లీ సందడి వాతావరణం నెలకొంది.తెలుగు రాష్ట్రాల్లో అన్నింటికి కూడా అనుమతి ఉంది.

కనుక షూటింగ్‌ లను ప్రారంభించేందుకు మేకర్స్ సిద్దం అయ్యారు.ఉదయం ఆరు నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది.

 Hero Nitin Movie Maestro Shooting Re Start-నితిన్ దారి తీశాడు.. ఇక అందరు ఆ దారిలో వెళ్లాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినా కూడా ఆ సమయంలోనే షూటింగ్‌ ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.ఈ సమయంలోనే నితిన్ తన మేస్ట్రో సినిమా చిత్రీకరణ మొదలు పెడుతున్నట్లుగా ప్రకటించాడు.

హైదరాబాద్ లో సినిమా చిత్రీకరణ మొదలు పెడుతున్నట్లుగా మేస్ట్రో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం నితిన్‌ తో పాటు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న నటీ నటులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

షూటింగ్‌ లు కొన్ని జరుగుతున్నా కూడా అధికారికంగా మరియు కాస్త పెద్ద సినిమా మొదలు అయ్యింది మాత్రం నేటి నుండే.అది కూడా నితిన్ మ్యాస్ట్రో సినిమా.

Telugu Corona 2nd Wave, Covid-19, Film News, Nitin-Movie

నితిన్ నేటి నుండి షూటింగ్‌ కు హాజరు అవుతూ సెకండ్‌ వేవ్‌ తర్వాత షూటింగ్ లకు దారి తీశాడు.కనుక ఆయన దారిలోనే మళ్లీ ఫిల్మ్‌ మేకర్స్‌ షూటింగ్ లను మొదలు పెట్టే అవకాశం ఉంది.ఈ నెల చివరి వరకు మరిన్ని సినిమాల షూటింగ్స్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.నితిన్‌ మ్యాస్ట్రో సినిమా చిత్రీకరణ మరో రెండు మూడు వారాల్లోనే పూర్తి చేస్తారట.

ఆగస్టు వరకు షూటింగ్‌ ను ముగించి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.షూటింగ్‌ లకు పెద్ద హీరోలు కూడా రెడీ అవుతున్నారు.

ఆచార్య నుండి అఖండ వరకు స్టార్‌ హీరోల సినిమా లు రీ స్టార్ట్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

#Corona 2nd Wave #Nitin #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు